తొలి రోజు భారత్‌దే..!
రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జ రుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. గురువారం చెన్నై వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 80 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. 144/6 పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్ ను రవిచంద్రన్ అశ్విన్ (112 బంతుల్లో 10 ఫో ర్లు, 2 సిక్స్‌లతో 102 బ్యాటింగ్) ఫైటింగ్ సెంచరీతో గట్టెక్కించాడు. రవీంద్ర జడేజా (117 బం తుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 86 బ్యాటింగ్)తో కలిసి ఏడో వికెట్‌కు అజేయంగా 195 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని అందించాడు. టాప్-6 బ్యా టర్లలో యశస్వి జైస్వాల్ (118 బంతుల్లో 9 ఫో ర్లతో 56), రిషభ్ పంత్(52 బంతుల్లో 6 ఫోర్లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. రోహిత్ శర్మ(6), శుభ్‌మన్ గిల్(0), విరాట్ కోహ్లీ(6), కేఎల్ రాహుల్(16) తీవ్రంగా నిరాశపరిచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహముద్(4/58) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. నహిద్ రాణా, మెహ్‌దీ హసన్ మిరాజ్ తలో వికెట్ తీసారు. తొలి రోజు ఆటలో తొలి సెషన్‌ో్ల పూర్తి ఆధిపత్యం చెలాయించిన బంగ్లాదేశ్.. రెండో సెషన్ ఆరంభంలో కాస్త పై చేయిసాధించింది. కానీ అశ్విన్ ఎంట్రీతో భారత్‌దే పైచేయి అయ్యింది.
రోహిత్, కోహ్లీ విఫలం
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహముద్ నిప్పులు చెరగడంతో తొలి 10 ఓవర్లలోనే రోహిత్ శర్మ(6), శుభ్‌మన్ గిల్(0), విరాట్ కోహ్లీ(6)ల వికెట్లు కోల్పోయింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ ఆదుకున్నారు. ఆచితూచి బ్యాటింగ్ చేసిన ఈ జోడీ తొలి సెషన్‌ను 88/3తో ముగించింది. లంచ్ బ్రేక్ అనంతరం రిషభ్ పంత్(39) ఔటవ్వగా.. యశస్వి జైస్వాల్ 95 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి పోరాడుతున్న అతన్ని నహిద్ రాణా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే కేఎల్ రాహుల్(16)ను హసన్ మీరాజ్ ఔట్ చేయడంతో 114 పరుగులకే భారత్ 6 వికెట్లు కోల్పోయింది. దాంతో టీమిండియా ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు.
ఆదుకున్న అశ్విన్..
కానీ ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన లోకల్ భాయ్ అశ్విన్ అటాకింగ్ బ్యాట్‌తో బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరోవైపు జడేజా కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో బంగ్లా బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు. క్విక్ సింగిల్స్‌తో పాటు వీలు చిక్కిన బంతిని ఈ జోడీ బౌండరీకి తరలించింది. దాంతో భారత్ 228/6 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది. మూడో సెషన్‌లో భారత బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడారు. అశ్విన్ 58 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. జడేజా 73 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. అనంతరం ఇదే సమన్వయంతో బ్యాటింగ్ చేసిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ నిర్ణీత సమయానికి 10 ఓవర్లు తక్కువగా వేసింది. ఆ జట్టుపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.