HomeNewsBreaking Newsఅవి వ్యూహాత్మక నిర్ణయాలు

అవి వ్యూహాత్మక నిర్ణయాలు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పొత్తులపై సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పొత్తులను వ్యూహాత్మక నిర్ణయాలుగా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా అభివర్ణించారు. బిజెపిని అడ్డుకోవడ మే తమ ప్రధాన లక్ష్యమని, ఈ నేపథ్యంలో తలెత్తిన కొన్ని రాజకీయ సమీకరణలకు అనుగుణంగా సీట్ల సర్దుబాటు జరిగిందని ఒక ఇంటర్వ్యూలో రాజా స్ప ష్టం చేశారు. తమిళనాడులో డిఎంకెతో వామపక్షాలు ఎన్నికల పొతు పెట్టుకున్న విషయం తెలిసిందే. సిపిఐకి ఆరు, సిపిఎంకు ఆరు చొప్పున సీట్లను డిఎంకె కేటాయించింది. నిజానికి వామపక్షాలు పదుల సంఖ్యలో సీట్లను ఆశించాయి. ఈ విషయాన్ని రాజా ప్రస్తావిస్తూ, ఒక్కోసారి రాజకీయ పరిణామలు, ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకొని రాజీ పడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రస్‌తోపాటు ముస్లిం మతపెద్ద అబ్బాస్‌ సిద్దిఖీ పార్టీ (ఐఎస్‌ఎఫ్‌)తో కలిసి వామపక్షాలు కూటమిగా ఏర్పడడాన్ని కూడా రాజా సమర్థించారు. బిజెపి లాంటి పార్టీని నిలువరించాలంటే, ఇలాంటి వ్యూహాత్మక పొత్తులు అవసరమని అన్నారు. ‘రాజకీయ ఒత్తుడులను కూడా ఈ సందర్భంగా అర్థం చేరుకోవాలి. తగినంత వాటా కోసం మేము శక్తివంచన లేకుండా కృషి చేసాం. కానీ, అది సాధ్యపడలేదు. అయితే, ఎక్కువ వాటా కోసం పట్టుబట్టే కంటే ఎఐఎడిఎంకె భుజాలపైకి ఎక్కి, తమిళనాడులో పాగా వేసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలకు కళ్లెం వేయడమే ప్రధానమని భావించాం. పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష పార్టీలు 101 నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతుండగా, కాంగ్రెస్‌కు 92 టికెట్లు కేటాయించారు. ఐఎస్‌ఎఫ్‌కు 37 సీట్లను ఇవ్వడంపై వ్యక్తమవుతున్న అసంతృప్తిని కూడా రాజా ప్రస్తావించారు. అబ్బాస్‌ సిద్దిఖీకిగానీ, ఐఎస్‌ఎఫ్‌కుగానీ హింసాత్మక సంఘటనలతో సంబంధం ఉందనడానికి ఏ ఒక్క సాక్ష్యం కూడా లేదని అన్నారు. ఇస్లామిక్‌ మతాన్ని నమ్మునింత మాత్రాన మత విద్వేషాన్ని అంటగట్టరాదని చెప్పరు. నిజానికి దేశంలో మతపరమైన రాజకీయాలను బిజెపి నడుపుతోందని రాజా ఆరోపించారు. దేశంలో ప్రజస్వామ్యాన్ని కాపాడుకునే నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, అసోం, కేరళ, పాండిచ్చేరి అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు అత్యంత కీలకమని అన్నారు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, తమ దృష్టి అధికార టిఎంసిపైన లేదని, బిజెపిని అడ్డుకోవడంపైనే కేంద్రీకృతమైందని రాజా చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి చొరబాటును అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో, అసలు ఆ పార్టీకి బెంగాల్‌లో ఎవరు అండగా ఉన్నారు? ఎవరు మద్దతునిస్తున్నారు? అసలు ఎవరు మార్గాన్ని సుగమమం చేశారు? అనే ప్రశ్నలకు సమాధారం రాబట్టాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ గాయపడిన విషయంపై ఆయన స్పందించారు. మమతకు గాయమైన విషయం వాస్తవమని, ఆ సంఘటన పూర్వాపరాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. దృష్టిలో ఉంచుకొని రాజీ పడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రస్‌తోపాటు ముస్లిం మతపెద్ద అబ్బాస్‌ సిద్దిఖీ పార్టీ (ఐఎస్‌ఎఫ్‌)తో కలిసి వామపక్షాలు కూటమిగా ఏర్పడడాన్ని కూడా రాజా సమర్థించారు. బిజెపి లాంటి పార్టీని నిలువరించాలంటే, ఇలాంటి వ్యూహాత్మక పొత్తులు అవసరమని అన్నారు. ‘రాజకీయ ఒత్తుడులను కూడా ఈ సందర్భంగా అర్థం చేరుకోవాలి. తగినంత వాటా కోసం మేము శక్తివంచన లేకుండా కృషి చేసాం. కానీ, అది సాధ్యపడలేదు. అయితే, ఎక్కువ వాటా కోసం పట్టుబట్టే కంటే ఎఐఎడిఎంకె భుజాలపైకి ఎక్కి, తమిళనాడులో పాగా వేసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలకు కళ్లెం వేయడమే ప్రధానమని భావించాం. పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష పార్టీలు 101 నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతుండగా, కాంగ్రెస్‌కు 92 టికెట్లు కేటాయించారు. ఐఎస్‌ఎఫ్‌కు 37 సీట్లను ఇవ్వడంపై వ్యక్తమవుతున్న అసంతృప్తిని కూడా రాజా ప్రస్తావించారు. అబ్బాస్‌ సిద్దిఖీకిగానీ, ఐఎస్‌ఎఫ్‌కుగానీ హింసాత్మక సంఘటనలతో సంబంధం ఉందనడానికి ఏ ఒక్క సాక్ష్యం కూడా లేదని అన్నారు. ఇస్లామిక్‌ మతాన్ని నమ్మునింత మాత్రాన మత విద్వేషాన్ని అంటగట్టరాదని చెప్పరు. నిజానికి దేశంలో మతపరమైన రాజకీయాలను బిజెపి నడుపుతోందని రాజా ఆరోపించారు. దేశంలో ప్రజస్వామ్యాన్ని కాపాడుకునే నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, అసోం, కేరళ, పాండిచ్చేరి అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు అత్యంత కీలకమని అన్నారు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, తమ దృష్టి అధికార టిఎంసిపైన లేదని, బిజెపిని అడ్డుకోవడంపైనే కేంద్రీకృతమైందని రాజా చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి చొరబాటును అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో, అసలు ఆ పార్టీకి బెంగాల్‌లో ఎవరు అండగా ఉన్నారు? ఎవరు మద్దతునిస్తున్నారు? అసలు ఎవరు మార్గాన్ని సుగమమం చేశారు? అనే ప్రశ్నలకు సమాధారం రాబట్టాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ గాయపడిన విషయంపై ఆయన స్పందించారు. మమతకు గాయమైన విషయం వాస్తవమని, ఆ సంఘటన పూర్వాపరాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments