HomeNewsBreaking Newsఅల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం..!

అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం..!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కి ఇది అరుదైన గౌరవం అని చెప్పాలి. న్యూ యార్క్‌ లో జరిగే ఇండియా డే పరేడ్‌ కి ఈ ఏడాది యావత్‌ భారత్‌ దేశానికి ప్రతినిధిగా గ్రాండ్‌ మార్షల్‌ హోదాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహ గారితో కలిసి హాజరయ్యారు. దాదాపు ఈ పరేడ్‌ కి ఐదు లక్షలు మందికి పైగా భారతీయలు వచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, అలానే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంత స్థాయిలో న్యూయర్క్‌ డే పరేడ్‌ కి ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్‌ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.అలానే ఈ సందర్శనలో భాగంగా న్యూర్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ని ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మర్యాదపూర్వకంగా కలిశారు, వారి సంభాషణల మధ్యలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో కలిసి ఎరిక్‌ ఆడమ్‌, ప్రపంచ వ్యాప్తంగా విశేష జనాధరణ పొందిన తగ్గేదేలే డైలాగ్‌ అలానే ఫోజ్‌ పెట్టడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ప్రస్తుతం అల్లు అర్జున్‌ పలు యాడ్స్‌ చేస్తూ బిజీగా ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments