స్టాక్‌హోమ్: పశ్చిమ బెంగాల్ మూలాలున్న భారత- అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రెమర్ అర్థశాస్త్రంలో 2019నోబెల్ బహుమతిని సంయుక్తంగా గెలుచుకున్నారని స్వీడిష్ అకాడమీ సోమవారం ప్రకటించింది. ‘ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ ముగ్గురి ప్రయోగాలు ఎంతగానో ఉపయోగపడతాయని’ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఫ్రెంచ్ ఎస్తేర్ డుఫ్లో, అభిజిత్ బెనర్జీ మస్సాచ్యూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అర్థశాస్త్ర ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. కాగా అభివృద్ధి అర్థశాస్త్రవేత్త అయిన మైఖేల్ క్రెమర్ హార్వర్డ్ యూనివర్శిటీలో డెవలపింగ్ సొసైటీస్‌కు సంబంధించిన గేట్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న అత్యంత పిన్న, రెండో మహిళ ఎస్తేర్ డుఫ్లో కావడం ఇక్కడ గమనార్హం. ఈసారి అర్థశాస్త్ర నోబెల్ బహుమతి ముగ్గురు అమెరికా వ్యక్తులకే రావడం యాదృచ్ఛిచకం. ఈ ముగ్గురికి అవార్డు కింద 9,18,000 డాలర్ల(9 మిలియన్ల క్రోనర్‌లు) నగదు, బం గారు పతకం, డిప్లొమా లభించనున్నాయి. బహుమతిని ఈ ముగ్గురు సమానంగా పంచుకుంటారు. అభిజిత్ బెనర్జీ (58) ఇండియాలోనే జన్మించారు. కలకత్తా యూనివర్శిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో చదివారు. ఆ తర్వాత ప్రఖ్యాత హర్వార్డ్ యూనిర్సిటీలో పిహెచ్‌డి పూ ర్తి చేశారు. అమెరికాలోని మస్సాచ్యూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అర్థ శాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 2003లో అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్((జె ఎస్తేర్ డుఫ్లో, సెంథిల్ ముల్లునాథన్‌తో కలిసి బెనర్జీ స్థాపించారు. సెంథిల్ ఇప్పటికీ ఆ ల్యాబ్ డైరెక్టర్లలో ఒకరిగా పనిచేస్తున్నారు. బెనర్జీతో కలిసి ఆయన భార్య ఎస్తేర్ డుఫ్లో రాసిన ‘పూ ర్ ఎకనామిక్స్: ఏ ర్యాడికల్ రీథింకింగ్ ఆఫ్ ద వే టు ఫైట్ గ్లోబల్ పావర్టీ’ అనే పుస్తకం 2011లో ఫైనాన్షియల్ టైమ్స్, గోల్డ్‌మన్ సాచ్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఆ పుస్తకం 17కు పైగా వేర్వేరు భాషల్లో అనువదితమయింది. ఎస్తేర్ డుఫ్లో అమెరికన్ ఎకనామిక్ రివ్యూ ఎడిటర్‌గా కూడా పనిచేస్తున్నారు. ప్రపంచ పేదరికాన్ని నిర్యూలించడానికి ఈ ముగ్గురు కొత్త విధానాన్ని కనుగొన్నారు. వారి పరిశోధన ఫలితాలు చా లా మెరుగ్గా ఉన్నాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది.
అర్థ శాస్త్రంలో అభిజిత్ బెనర్జీకి నోబెల్
RELATED ARTICLES