పురుషుల హాకీ ప్రపంచకప్
భువనేశ్వర్: ప్రపంచ రెండో ర్యాంక్ అర్జెంటీనాకు 20వ ర్యాంకర్ ఫ్రాన్స్ షాకిచ్చింది. హాకీ ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇక్కడ జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 5 గోల్స్ తేడాతో పటిష్ట అర్జెంటీనాపై సంచలన విజయం సాధించింది. మ్యాచ్ ఆరం భం నుంచే దూకుడుగా ఆడిన ఫ్రాన్స్ వరుసక్రమంలో గోల్స్ కోడుతూ అర్జెంటీనాను హ డలెత్తించింది. ఫ్రాన్స్ తరఫున (8వ) నిమిషంలో గెనెస్టేట్ హుగో, (23వ) నిమిషంలో చార్లెట్ విక్టర్, (26వ) నిమిషంలో అరిస్టాయిడ్ వరుసగా గోల్స్ చేయడంతో ఫ్రాన్స్ 3 భారీ ఆధిక్యం సాధించింది. తర్వాత (28వ) నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్టినెజ్ లుకాస్ తొలి గోల్‌తో తమ జట్టు ఖాతా తెరిచాడు. ఆ వెంటనే ఫ్రాన్స్ ఆటగాడు గాస్పర్డ్ (30వ) నిమిషంలో మరో గో ల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 4 చేర్చాడు. తర్వాత పుంజుకున్న అర్జెంటీనా ప్రత్యర్థి గోల్ పోస్టుపై వరుస దాడులు చేస్తూ 44వ, 48వ నిమిషాల్లో మరో రెండు గోల్స్ చేసిం ది. అయితే చివర్లో ఫాన్స్ (54వ) నిమిషం లో మరో గోల్ చేసి మ్యాచ్‌ను 5- గెలుచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా కూ డా అర్జెంటీనా క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. తమ పూల్‌లో 6 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచిన అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. సంచలన విజయాన్ని నమోదు చేసిన ఫ్రాన్స్ 4 పాయింట్లతో రెం డో స్థానం దక్కించుకుంది.
అర్జెంటీనాకు ఫ్రాన్స్ షాక్..!
RELATED ARTICLES