బెంగళూరు: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో రెండు వికెట్లు తీస్తే చాలు టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను బుమ్రా అధిగమిస్తాడు. విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో బుమ్రా 16 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో భారత్ తరఫున టి20ల్లో 50 వికెట్లు తీసిన వారి క్లబ్‌లో దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రా వికెట్ల సంఖ్య 51కు చేరింది. దీంతో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు బుమ్రా. ఇక ఈ జాబితాలో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 52 వికెట్లతో బుమ్ర కంటే ముందున్నాడు. బుధవారం బెంగళూరు చిన్నస్వామి వేదికగా ఆసీస్‌తో కోహ్లీసేన రెండో టి20 మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్‌లో సత్తా చాటిని బుమ్రా చిన్నస్వామి స్టేడియంలోనూ తన ప్రతాపాన్ని చూపెట్టెందుకు సిద్ధమయ్యాడు. పదునైన యార్కర్లతో విజృంభించే బుమ్రా ఈ మ్యాచ్‌లో కనీసం ఒక వికెటైనా తీస్తే.. అశ్విన్‌తో సమఉజ్జీగా నిలుస్తాడు. ఒక వేళ రెండు వికెట్లు తీస్తే కొత్త చరిత్ర సృష్టిస్తాడు. పొట్టి క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసినబౌలర్‌గా బుమ్రా రికార్డుల్లో ఎక్కుతాడు. ఇక పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది 98 వికెట్లతో ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు.
అరుదైన రికార్డు చేరువలో బుమ్రా
RELATED ARTICLES