బిగ్‌బాష్‌లో చెలరేగిన ఎబి డివిలియర్స్
అడిలైడ్: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరమైనా.. తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు సౌతాఫ్రికా లెజె్‌ండ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగే ఈ సౌతాఫ్రికా ప్లేయర్ ఫీల్డింగ్‌తోనూ మైమరిపిస్తాడు. కేవలం టీ20 లీగ్‌లు మాత్రమే ఆడుతున్న ఏబీ.. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. బ్రిస్బెన్ హీట్ టీమ్ తరఫున అడిల్్ైడ స్ట్రైకర్‌తో జరిగిన మ్యాచ్‌తో బీబీఎల్‌లో అరంగేట్రం చేసిన ఏబీ ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టాడు.తమ జట్టు బౌలర్ జేమ్స్ పట్టిన్సన్ వేసిన 10వ ఓవర్ నాలుగో బంతిని అడిల్్ైడ బ్యాట్స్‌మన్ ఆఫ్ స్్ైడ ఆడబోగా.. ఫార్వార్డర్గా ఉన్న డివిలియర్స్ అద్భుత డైవ్‌తో బంతినందుకున్నాడు. దీంతో కామెంటేటర్స్..’ ఏబీ బ్రిస్బెన్ హీట్‌కు స్వాగతం.. అతని అద్భుత క్యాచ్‌తో జిమ్మికి ఐదు వికెట్లు దక్కాయి.’అంటూ రిపీటెడ్‌గా వ్యాఖ్యానించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆసీస్ లెజె్‌ండ ఆల్‌రౌండర్ అండ్రూ సైమండ్స్ చేతుల మీదుగా డివిలియర్స్ బ్రిస్బెన్ హీట్ క్యాప్ అందుకున్నాడు. ఇక బ్రిస్బెన్ కెప్టెన్ క్రిస్ లిన్‌తో కలిసి ఆడటం సంతోషంగా ఉందని ఏబీ తెలిపాడు. ’ఐపీఎల్లో మేం ఒకరికొకరం తెలుసు. కలిసి మాట్లాడుకున్నాం కూడా. కానీ ఇద్దరం ఒకేసారి క్రీజులోకి దిగడం ఇదే తొలిసారి. మా జోడీ కుదురుకుంటుందా లేదా అన్నది నాకు తెలియదు. లిన్‌తో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. చాలా వరకు నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండి అతని ఆటను చూస్తాననుకుంటున్నా’అని ఏబీ తెలిపాడు. అన్ని టోర్నీల్లో ఉండే ఒత్తిడే బీబీఎల్‌లోనూ ఉంటుందన్నాడు. ఇక 304 టీ20ల్లో డివిలియర్స్ నాలుగు సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలతో 8511 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిల్్ైడ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 110 రన్స్‌కు ఆలౌటైంది. అనంతరం బ్రిస్బెన్ హీట్ 15.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి 7 వికెట్లతో గెలుపొందింది. డివిలియర్స్(40) పరుగులతో రాణించాడు.
అరంగేట్రమే అదుర్స్
RELATED ARTICLES