న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు ఆధ్వర్యం లో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. సామరస్యపూర్వకంగా పరిష్కారం కుదుర్చుకునేందుకు మధ్యవర్తుల పేర్లను సిఫార్సు చేయాల్సిందిగా అన్ని సంబంధిత పార్టీలను కోరింది. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగో య్, జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే, జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. మధ్యవర్తి నియామకంపై ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో పెడుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. నిర్మోహి అఖాడ తప్ప మిగతా హిందూ సంస్థలు మధ్యవర్తిని ఏర్పాటు చే యడంపై వ్యతిరేకత చూపిస్తుండగా, ము స్లిం సంస్థలు మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనం సూచనకు మద్దతునిచ్చాయి. ‘మధ్యవర్తిని నియమించడం మాకు అంగీకార మే. పరిష్కారమేదైనా అది ఇరు వర్గాలను కలి పి ఉంచాలి’ అని ముస్లిం పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ కోర్టుకు తెలిపా రు. అటు యూపి ప్రభుత్వం కూడా మధ్యవర్తిని యామకాన్ని వ్యతిరేకించింది. ప్రస్తు త పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదని పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ అంశంపై తీర్పును న్యాయస్థానం రిజర్వ్‌లో ్ల పెట్టింది. అయితే ఒకవేళ సమస్యను మధ్యవర్తికి అప్పగించేలా న్యా యస్థానం నిర్ణయం తీసుకుంటే గనుక ఇరు పక్షాలు మధ్యవర్తుల పేర్లు సూచించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. యూపి ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. పరిషారానికి అవకాశం ఉన్నట్లయితేనే విషయాన్ని మధ్యవర్తిత్వానికి అప్పగించాలని ఆయన కోర్టుకు చెప్పా రు. కాగా రామ్‌లల్లా విరాజ్‌మాన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ కోర్టు ధర్మాసనానికి ‘మధ్యవర్తిత్వం ఎప్పుడూ ఫలించలేదని,గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం రాలేదు’అన్నారు. ‘పివి నర్సింహా రావు ప్రభుత్వం 1994లో ఒకవేళ ఎప్పుడైనా అక్కడ దేవాలయం ఉండేదని కనుగొనబడితే, అప్పుడు భూ మిని రామ మందిర నిర్మాణానికి ఇచ్చేయాలని కోర్టుతో కమిట్ అయింది’ అని బిజెపి నాయకుడు సుబ్రమణ్యన్ స్వామి చెప్పారు.‘ఇది కేవలం భూ వివాదం మాత్రమే కాదు. మత విశ్వాసానికి, భావోద్వేగానికి సంబంధించిన అంశం. గతాన్ని మనం మార్చలేం. ఎవరు కూల్చారు.. ఎవరు రాజు.. ఆలయమా.. మసీదా అన్నది ఇప్పుడు అప్రస్తుతం. ప్రస్తుత వివాదాన్ని మాత్రమే మేం పరిగణనలోకి తీసుకుంటాం. ఆ వివాదాన్ని పరిష్కరించాలని చూస్తాం. సమస్య పరిష్కారానికి ఒకరి కంటే ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరం అని భావిస్తున్నాం’అని జస్టిస్ బోబ్డే అన్నారు.2.77 ఎకరాల వివాదాస్పద భూమి ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వ్యక్తులు, ధార్మికసంస్థల తరఫున 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్
RELATED ARTICLES