ప్రజాపక్షం / హైదరాబాద్ ః రాబోయే అయిదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు రాష్ట్రంలో సాధారణంగా ఉన్నాయని పేర్కొంది. శుక్రవారం ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా కుసుమంచిలో 7 సెంటిమీటర్ల వర్షం కురిసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 5 సెంటిమీటర్లు, మెదక్ జిల్లా రామాయంపేటలో 4, సంగారెడ్డి జిల్లా జోగిపేటలో 4, హత్నూరాలో 3, సిరిసిల్ల జిల్లా గంభీరావ్‌పేటలో 3, పాల్వంచలో 3, సిరిసిల్లలో 3, నల్గొండ జిల్లా చందూర్‌లో 3 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఈ నెల 8న రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తునిర్వహణ కేంద్రం తెలిపింది.
అయిదు రోజులపాటు తేలికపాటి వర్షాలు
RELATED ARTICLES