బ్యాట్‌తో రాణించిన షెఫాలీ.. బాల్‌తో చెలరేగిన రాధా
శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం
గ్రూప్ దశలో ఓటమెరుగని భారత్
ఐసిసి టి20 వరల్డ్‌కప్
మెల్‌బోర్న్: ఓవైపు న్యూజిలాండ్ గడ్డపై వరుస పరాజయాలతో భారత పురుషుల జట్టు తడబడుతుండగా.. మరోవైపు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళలు తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో నాకౌట్ చేరిన హర్మన్ ప్రీత్ సేన.. శ్రీలంకతో శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-ఎలో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లోనూ భారత మహిళల జట్టు విజయం సాధించింది. దీంతో గ్రూప్ స్టేజ్‌లో ఓటమే లేకుండా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాని ఓడించిన భారత్ జట్టు.. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లను ఓడించి సెమీస్ చేరింది. శ్రీలంకతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లోనూ అదేజోరుని కొనసాగించింది. ముందుగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేశారు. చమిరా ఆటపట్టు(33), కవిషా దిల్హరి(25)లు రాణించడంతో లంక ఆ మాత్రం సోరైనా సాధించింది. భారత బౌలర్లలో స్పిన్నర్ రాధా యాదవ్ నాలుగు వికెట్లు సాధించగా, మరో స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీశారు. దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, శిఖా పాండేలకు తలో వికెట్ దక్కింది. 114 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌కి ఓపెనర్లు మంధాన (17; 12 బంతుల్లో 3పోర్లు), షపాలి వర్మ (47; 37 బంతుల్లో 7పోర్లు, 1సిక్స్) మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ (15; 14 బంతుల్లో 2పోర్లు, 1సిక్స్), జెమీమా (15 నాటౌట్: 15 బంతుల్లో 1పోర్), దీప్తి శర్మ (15 నాటౌట్: 13 బంతుల్లో 2పోర్లు) కూడా దూకుడుగా ఆడారు. దీంతో.. కేవలం 14.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
రాధా సూపర్ బౌలింగ్..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ చమరి ఆటపట్టు(33), కవిశ దిల్‌హరి(25 నాటౌట్) టాప్‌స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలింగ్‌లో రాధా యాదవ్ 4, రాజేశ్వర్ గైక్వాడ 2 దీప్తీ శర్మ, శిఖా పాండే, పూనమ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలు.. 14.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసి 32 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకున్నారు. భారత బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ(47) మరోసారి మెరుపులు మెరిపించగా.. స్మృతి మంధాన(17), హర్మన్ ప్రీత్ కౌర్(15) విఫలమయ్యారు. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ (15 నాటౌట్), దీప్తీ (15 నాటౌట్) జాగ్రత్తగా ఆడి లక్ష్యాన్ని పూర్తి చేశారు. ప్రత్యర్థి బౌలర్లలో ఉదేశిక, సిరివర్థనే తలో వికెట్ తీశారు.
షెఫాలీ మెరుపులు..
114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు యువ సంచలనం షెఫాలీ వర్మ, స్మతి మంధాన అదిరే ఆరంభాన్నిచ్చారు. బౌండరీలతో విరుచుకుపడుతూ తొలి వికెట్‌కు 34 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో మంధాన ఔటైనా.. క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్(15)తో షెఫాలీ చెలరేగింది. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.
భారీ సిక్సర్‌తో ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన హర్మన్.. ఆ జోరును కొనసాగించలేకపోయింది. 14 బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్‌తో 15 పరుగులు చేసిన హర్మన్.. సిరివర్ధనే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. ఈ మెగాటోర్నీలో హర్మన్ ఇప్పటివరకు తనదైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఇక హర్మన్ ఔటైనా.. షెఫాలీ మాత్రం వెనకడుగు వేయలేదు. భారీ షాట్లతో హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్లింది. కానీ క్రీజులోకి వచ్చి జెమీమాతో సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(15 నాటౌట్), జెమీమా(15 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి భారత్‌కు సునాయస విజయాన్నందించారు.
అమ్మాయిలు అదుర్స్!
RELATED ARTICLES