డిసెంబరు 31వరకు మినహాయింపు
వాషింగ్టన్ : అమెరికాలో పలు కార్యక్రమాలకు హాజరయ్యే ప్రముఖులకు, కళాకారులకు, విద్యార్థులకు, ఇతరులకు ఇకపై వీసాలు చాలా సులభంగా లభిస్తాయి. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరై సమాధానాలు చెప్పలేక ఇంటర్వ్యూలో విఫలమై నిరాశ చెందాల్సిన అవసరం లేకుండా ఇక మీదట అమెరికా వెళ్లే వారికి ముఖాముఖీ ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు ఇస్తారు. అయితే సంబంధిత పర్యాటకులు లేదా విద్యార్థులు, కుటుంబీకులకు అమెరికాల నిర్దేశిత లక్ష్యం, కార్యక్రమం ఉండాలి. అమెరికాలోని ఆయా ప్రాంతాలలో వారి పర్యటనకు సంబంధించిన అవతలివైపు నుండి ధృవీకరణ ఉండాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో పర్యాటకులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు వీలుగా అమెరికా ఈ తాజా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏడాది డిసెంబరు 31 వరకూ మాత్రమే ఈ అవకాశం అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారికి అందుబాటులో ఉంటుంది. అయితే గతంలో జరిగిన ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురైనవారికి, అనర్హులకు మాత్రం ఈ ముఖాముఖీ ఇంటర్వ్యూల నుండి మినహాయింపు లభించదు. అలాంటివారు మరోసారి ముఖాముఖీ ఇంటర్వ్యూలకు హాజరైన పర్యటన ఉద్దేశం, ప్రాధాన్యం, అవసరం తదితరాలకు సంబంధించిన తమ స్థితిగతులను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎఫ్,ఎం,విద్యాసంబంధమైన జె తరహా వీసాలకు, కార్మికులకు అంటే హెచ్ హెచ్ హెచ్ వీసాలు, వ్యక్తిగత పర్యటనలకు సంబంధించిన ఎల్ వీసాలు, సాంస్కృతిక రంగంలో నైపుణ్యంగల కళాకారులు, అసామాన్యమైన ప్రతిభగల వ్యక్తులకు సంబంధించిన ఓ, పి, క్యూ తర హా వీసాలకు దరఖాస్తు చేసుకున్నవారికీ ఈ తాజా మినహాయింపు లభిస్తుంది. ఈ మినహాయింపు 2022 డిసెంబరు 31వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అమెరికాలో పర్యటించడానికి వీసా కోసం దరఖాస్తు చేససుకున్నవారికి ఇదొక గొప్ప అవకాశం, అమెరికా ప్రభుత్వం నుండి వారికి ఒక మంచి మద్దతు లభించింది, అమెరికాలో ఉన్న తమ బంధువులను కలుసుకోవాలని కోరుకునే రక్తసంబంధీకులకు,అమెరికాలో ఉన్న తమవారికోసం ఎంతో ఆందోళనతో, తపనపడుతున్నవారికీ ఇది ఒక మంచి అవకాశం అని దక్షిణ ఆసియా వ్యవహారాల నాయకులు అజయ్ జైన్ భూటోరియా చెప్పారు. ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆసియా అమెరికన్ల తరపున సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. దక్షిణమధ్యా ఆసియా వ్యవహారాల అమెరికా సహాయమంత్రి డోనాల్ లూ తో సమావేశమైన అనంతరం అజయ్ జైన్ భూటోరియా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ అమెరికా ప్రజలమధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడానికి వీలుగా ఈ వీసా ఇంటర్వ్యూల మిన దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. అమెరికా కూడా దీనినే కోరుకుంటోందని కూడా ఆయన అన్నారు. ఈ సమావేశంలో డోనాల్ లూతో జరిపిన చర్చల్లో ఈ అంశమే ప్రధానంగా బిందువుగా ఉండటంతో ముఖాముఖీ ఇంటర్వ్యూల రద్దుకు మార్గం సుగమం అయింది. ఈ సమావేశంలో డోనాల్ లూ ఇటీవల భారతీయ వలస కార్మికులకు సంబంధించిన ప్రయాణాల్లో చేసిన మార్పుల గురించి ఆయనకు వివరించారు.నిపుణులైనవారికి అమెరికాలో పనులు చేయడానికి, విద్యార్థుల విద్యాభ్యాసానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని చెప్పారు. భూటోరియా ప్రత్యేకించి ఈ విషయాన్ని డోనాల్ లూతో ప్రస్తావించి ఈ అవకాశం వచ్చేట్టు చేశారు. అమెరికా విదేశాంగశాఖ ఈ విధమైన వ్యక్తిగతంగా హాజరయ్యే ముఖాముఖీ ఇంటర్వూలకు 10 నెలలపాటు రద్దు చేస్తూ ఒక మంచి అకాశం ఇచ్చిందని ఆయన సమావేశం అనంతరం చెప్పారు. అయితే ఈ వీసా ఇంటర్వ్యూల మినహాయింపు అవకాశం అందరికీ వర్తించదు. గతంలో విఫలమైనవారికి ఆ అవకాశం లేదు. గతంలో ఇంత వరకూ ఎవరికీ వీసా ఇవ్వనివారు, ఇంతవరకూ వీసా ఇంటర్వ్యూలో విఫలంకాని వారికి ఒక సువర్ణావకాశం. అయితే వారికి సంబంధిత అమెరికా రాష్ట్రంలోని ఒక చిరునామా నుండి తప్పనిసరిగా ఆహ్వానం ధృవీకరణ ఉండాలి. లేదా వారి పర్యటన ప్రాధాన్యం, వారి పర్యటన కోరుకునేవారి నుండి ఖచ్చితమైన ఆహ్వానం ఉండాలి. వారు కూడా అదే దేశానికి చెందినవారై ఉండాలి.న్యూఢిల్లీలో,అమెరికా దౌత్యకార్యాలయం ద్వారా చెన్నై, హైదరాబాద్, కోల్‌కత, ముంబయిలకు చెందిన సంప్రదింపుకర్తలు అర్హులైన సుమారు 20,000 మందికి అదనంగా వీసాలకోసం దరఖాస్తులను పంపించే అవకాశం ఉంది. వీరందరికీ ముఖాముఖీ ఇంటర్వ్యూలు ఉండే అవకాశం లేదు. న్యూఢిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయం వెబ్‌సైటులో ఈ నోటీసు పోస్టు చేసింది.
అమెరికా వీసాలకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు
RELATED ARTICLES