డెమొక్రటిక్ నుంచి బరిలోకి…
భారత సంతతి మహిళకు అత్యున్నత గౌరవం
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి మహిళకు అత్యున్నత గౌరవం దక్కింది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్న జో బిడెన్ .. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి వ్యక్తిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. కమలా హారిస్ ప్రస్తుతం కాలిఫోర్నియా నుంచి డెమొక్రట్ పార్టీ సెనేటర్‌గా ఉన్నారు. జో బిడెన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా
కూడా వ్యవహరిస్తున్నారు. కమలా హారిస్ ఎంపికను జో బిడెన్ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. తామిద్దరం కలిసి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించబోతున్నామన్నారు. అమెరికాను తిరిగి గాడిలో పెట్టేందుకు కమలా హారిస్ తనకు చక్కని భాగస్వామి అని అభివర్ణించారు. తన ఎంపికపై స్పందించిన కమలా హారిస్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. కమలా హారిస్ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి ఆఫ్రికాలోని జమైకా దేశస్థుడు. తమిళనాడుకు చెందిన కమల తల్లి శ్యామలా గోపాలన్ 1960లో అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిర పడ్డారు.
ఆమె ఎంపిక ఆశ్చర్యాన్ని కలిగించింది: ట్రంప్
డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఒక ’భయంకరమైన వ్యక్తి’ అంటూ వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. ప్రైమరీల స్థాయిలో నామినేషన్ కోసం పోటీ పడుతున్నప్పుడే ఆమె పేలవ ప్రదర్శన తనను ఆకట్టుకోలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ఆమె పేలవ ప్రదర్శన చూసి చాలా ఆశ్చర్యపోయాను. యుఎస్ సెనేట్‌లో ఆమె అంత అగౌరవనీయమైన వ్యక్తి ఎవరూ లేరు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్
RELATED ARTICLES