ప్రజాపక్షం/హైదరాబాద్; హైదరాబాద్‌కు చెందిన యువతి అమెరికాలో అత్యాచారం, హత్యకు గురైన విషాదర సంఘటన ఇది. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో చదువుతున్న రూత్ జార్జ్ (19)పై ఈ నెల 22న అత్యాచారం, హత్య జరిగినట్లు స్థానిక పోలీసులు నిర్ధారించారు. 23న రూత్‌జార్జ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. క్యాంపస్ సమీపంలో ఉండే డోనాల్డ్ తుర్మాన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సిసి టివి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఈ నిందితుడు ఓ దొంగతనం కేసులో గతంలో ఆరేళ్లపాటు జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన రూత్‌జార్జ్ కుటుంబం 20 ఏళ్ల క్రితం చికాగోలో స్థిరపడింది. యూనివర్సింటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో ఆనర్స్ స్టూడెంట్‌గా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదం టూ తల్లిదండ్రులు యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం సాయంత్రం మృతదేహాన్ని క్యాంపస్ గ్యారేజ్‌లోని ఆమె కారు వెనక సీట్లో గుర్తించారు.
అమెరికాలో హైదరాబాద్ యువతిపై అత్యాచారం, హత్య
RELATED ARTICLES