వర్కింగ్ వీసా ఉద్యోగులకు అతి తక్కువ వేతనాలు వెల్లడించిన సరికొత్త నివేదిక
వాషింగ్టన్ : అమెరికాలో ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలు వర్కింగ్ వీసాపై వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులకు మార్కెట్లో నిర్దేశించిన మధ్యతరహా వేతనాలకంటే అతితక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్టు సరికొత్త నివేదిక ఒకటి వెల్లడించింది. హెచ్1 బి వీసాపై పనిచేసే ఉద్యోగులకు టెంపరరీ వర్కింట్ వీసా ప్రోగ్రామ్ కింద నిర్దేశిత మార్కెట్ వేతనాల కంటే అతితక్కువ వేతనాలిచ్చి పని చేయించుకుంటున్నట్టు నివేదిక వెల్లడించింది. హెచ్1 బి వీసా అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. అంటే అమెరికాలో ఉన్న కార్పొరేట్ దిగ్గజ సంస్థలు భారత్, చైనా వంటి దేశాల నుంచి తమ అవసరాలకు అనుగుణంగా సైద్ధాంతిక, సాంకేతిక నైపుణ్యంగల కార్మికులను, మేధావులను పిలిపించి పనులు చేయించుకుంటుంది. ఈ విధంగా అమెరికాలో ఐదులక్షల మంది వలస ఉద్యోగులు హెచ్1 బి వీసా హోదాలో ఉన్నారు. వీరి లో ఎక్కువమంది అమెరిజాన్, వాల్‌మార్ట్, గూగుల్, మైక్రోసాఫ్, యాపిల్, ఫేస్బుక్ కంపెనీల్లోనే పనిచేస్తున్నారు. అయితే ఈ కంపెనీలన్నీ టెంపరరీ వర్క్ వీసా ప్రోగ్రామ్ నిబంధనలను అడ్డంపెట్టుకుని, వాటి ఆసరాతో, చట్టబద్ధంగా ఇవ్వాల్సిన దానికంటే అంటే మార్కెట్ వేతనాల కంటే తక్కువగా వారికి చెల్లిస్తున్న ట్టు ఎకనామిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన సరికొత్త నివేదిక వెల్లడించింది. అయితే అమెరికా కార్మిక శాఖకు అధికారాలున్నప్పటికీ పట్టించుకోవడం లేదని కూడా పేర్కొంది. ఈ విధంగా 2019లో 53వేల కార్పొరేట్ కంపెనీల యజమానులలో అగ్రశ్రేణికి చెందిన 30 కంపెనీల్లో పనిచేస్తున్న మూడు లక్షల 89వేల మంది హెచ్1 బి పిటిషన్లకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రెంట్ సర్వీసులకు సంబంధించిన ఆమోదం గత ఏడాది లభించినట్టు పేర్కొంది. హెచ్1 బి వీసా పరిధిలో ఉన్న ఈ అగ్రశ్రేణి 30 కంపెనీల్లో సగానికి సగం కంపెనీలు ఈ ఉద్యోగులకు నేరుగా ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే పేరుతో థర్డ్‌పార్టీ క్లయింట్ల ద్వారా తమ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇలా 2019లో ఈ వీసాల కింద లెవెల్ 1, లెవెల్2 ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాల కంటే అతి తక్కువగా చెల్లిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అయితే డైరెక్ట్‌గా నియమించుకున్న ఉద్యోగులకు అమెరిజాన్, గూగుల్, క్వాల్కామ్, ఊబర్, యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే లెవెల్ 1, లెవెల్ 2 లలో ఆ వేతనాలు చెల్లిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. హెచ్1 బి వీసాల వినియోగంలో గత ఏడాది ఏడవ స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ కేవలం 18 శాతం మందికి మాత్రమే లెవెల్ 3 లెవెల్ 4 ఉద్యోగులకు కార్మిక నిబంధనల ప్రకారం నిర్దేశిత మాథ్యమికస్థాయి వేతనాలు చెల్లిస్తోందని, 77 శాతం మందికి అంటే లెవెల్ 1, లెవెల్ 2 ఉద్యోగులకు మార్కెట్ వేతనాలకంటే నిర్దేశిత మాధ్యమికస్థాయి వేతనాలు చెల్లించడం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. అదేవిధంగా హెచ్1 బి వీసా ఉద్యోగుల వినియోగంలో రెండుసార్లు నాలుగోస్థానంలో నిలిచిన అమెజాన్ డాట్ కామ్ సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లు అన్ని లెవెల్స్‌కు చెందిన 86 శాతం, 85 శాతం సర్టిఫైడ్ ఉద్యోగులకు నిర్దేశిత వేతనాల కంటే తక్కువ చెల్లిస్తోంది. అలాగే యాపిల్ 32, 34 శాతం ఉద్యోగులకు, గూగుల్ 54, 37శాతం, ఫేస్బుక్ 10, 16,49 శాతం వంతున వివిధ లెవెల్స్‌లో వర్కింగ్ వీసా ఉద్యోగులకు మాధ్యమిక వేతనాల కంటే తక్కువగా చెల్లిస్తున్నాయి. హెచ్1 బి వీసా ఉద్యోగుల వినియోగంలో గత ఏడాది 29వ స్థానంలో నిలిచిన ఊబర్ కూడా వివిధ లెవెల్స్‌లో ఉద్యోగులకు 53శాతం, 13శాతం వంతున తక్కువగానే వేతనాలు చెల్లిస్తున్నాయి. అయితే ఇలా అగ్రస్థానంలో ఉన్న 30 కంపెనీలూ కూడా లెవెల్ 1, లెవెల్ 2 స్థాయిలో వర్కింగ్ వీసా ఉద్యోగులను సాధారణస్థాయి నైపుణ్యం ఉన్న (లిటిల్, ఆర్డినరీ) వారినే తీసుకుంటున్నట్టు నివేదిక వెల్లడించింది.
అమెరికాలో కార్పొరేట్ దిగ్గజాల దొంగ నాటకాలు!
RELATED ARTICLES