లోగన్‌స్పోర్ట్ : అమెరికాలోని ఇండియానాలో లోగన్‌స్పోర్ట్ నగరంలోని ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. వీరిలో 25 ఏళ్ల మహిళ సహా ఆమె ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరో 42 ఏళ్ల వ్యక్తి, అతని పదేళ్ల కుమార్తె కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. చనిపోయిన నలుగురు పిల్లల్లో ముగ్గురి వయసు మూడేళ్లలోపు అని, మరో చిన్నారి వయసు పదేళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓ మహిళ, ఆమె కుమారున్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాత్రి 2 గంటల సమయంలో ఈ మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇల్లు మొత్తం మంటలు అలుముకున్నాయని, వీటిని ఆర్పేందుకు చాలా సమయం పట్టిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. భవన నిర్మాణానికి ఎక్కువగా కలప వాడడం వల్ల మంటలు తీవ్రంగా వ్యాపించినట్లు పేర్కొన్నారు. సమీపంలో ఎక్కడా నీటి జాడ లేకపోవడంతో అగ్నికీలలను ఆర్పేందుకు ట్యాంకులను రప్పించామని తెలిపారు. ఇలాంటి అగ్ని ప్రమాదం తమ జీవితంలో ఎన్నడూ చూడలేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
అమెరికాలో అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
RELATED ARTICLES