అమృత్సర్: ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత పంజాబ్‌ను కూడా తాకింది. అమృత్‌సర్‌లోని నీలకంఠ్ హాస్పిటల్లో ఆరుగురు సకాలంలో ఆక్సిజన్ అందక మృతి చెందారు. వారిలో ఐదుగురు కొవిడ్ రోగులు. అత్యవసర చికిత్సలు పొందుతున్న వారికి ఆక్సిజన్ లేకపోతే మరణాలను ఎవరూ అడ్డుకోలేరని ఆ ఆసుపత్రి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ దేవగన్ అన్నారు. ఆరుగురి మృతికి పంజాబ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం ముందుగానే దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. సత్వరమే ఆక్సిజన్ సిలిండర్లను పంపడం ద్వారా మరిన్ని మరణాలను నిలువరించాలని కోరారు.