న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి, బిజెపి అగ్రనేత అమిత్ షా కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు నిర్వహించిన కొవిడ్- పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అమిత్ షా ఆదివారం ట్వీట్ చేశారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందన్న అమిత్ షా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచనతో ఆస్పత్రిలో చేరానని తెలిపారు. ఈ మేరకు హిందీలో ఆయన హిందీలో ట్వీట్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది ఈ వైరస్ బారినపడ్డారు.
తమిళనాడు గవర్నర్‌కు కొవిడ్
తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కావేరీ హాస్పిటల్ అధికారికంగా ప్రకటించింది. ఆయనకు కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యం నిలకడగానే ఉందని చెన్నై కావేరీ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు. ఆయనకు కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించినట్లు చెప్పారు. కావేరీ హాస్పిటల్ వైద్య బృందం ఆయనకు ఇంటి వద్దే చికిత్సనందిస్తుందని తెలిపారు. తమిళనాడు రాజ్‌భవన్‌లో 84 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. దాదాపు రెండు వారాల క్రితం నుంచే తమిళనాడు గవర్నర్ ఐసోలేషన్‌లో ఉన్నారు. గవర్నర్ ఇంటి వద్ద ప్రతీ రోజు డిస్‌ఇన్‌ఫెక్షన్ డ్రైవ్ కూడా నడుస్తోంది. తమిళనాడులో ఇప్పటికే ముగ్గురు మంత్రులు కరోనా బారిన పడి, కోలుకున్నారు. తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇతర జిల్లాలకు, పల్లెలకు ఈ మహమ్మారి విస్తరించడం కాస్త ఆందోళన కలిగించే విషయం.
అమిత్‌షాకు కరోనా పాజిటివ్
RELATED ARTICLES