ప్రజాపక్షం / హైదరాబాద్ సిఎం కెసిఆర్‌కు ఇదే చివరి బడ్జెట్ అని, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ మాదిరిగానే అమలు చేయని హామీలతో సిఎం కెసిఆర్ మాయ చేయాలనుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. ‘బడ్జెట్‌ను చూస్తే నవ్వొస్తుదని, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ప్రభుత్వ బడ్జెట్ ప్రసంగంలో నీతి అంతే ఉందని, బడ్జెట్ ప్రసంగ పేజీలు పెంచారు, బరువు పెంచారు, అబద్ధాలు కూడా పెంచారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో సోమవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022 వార్షిక బడ్జెట్‌పై బండి సంజయ్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో స్పందించారు. ఎలాగూ అసెంబ్లీని రద్దు చేసి కెసిఆర్ ఎన్నికలకు వెళతామనుకున్నట్టున్నారని, ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను పేజీల కొద్దీ చదివారని, వేల కోట్ల హామీలిచ్చారని, ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం కోతలు కోస్తున్నదని విమర్శించారు.
అమలు చేయని హామీలతో మాయ
RELATED ARTICLES