ఎంఆర్‌పి ధరలపై రూ. 20 నుంచి
రూ.160 వరకు పెంపు
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ర్టంలో పెరిగిన మద్యం ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. చివరి సారిగా 2020 మే నెలలో మద్యం ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే మద్యంపైన పాత ఎంఆర్‌పి ధరలు ఉన్నప్పటికీ కొత్త ధరలు వర్తిసాయని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఎంఆర్‌పి ధరలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సమస్యల పరిష్కారానికి, ఫిర్యాదుల ) కోసం టోల్ ఫ్రీనంబర్ 1800 425 2523 కు పోన్ చేయాలని ఆ శాఖ సూచించింది. రూ. 200 లోపు ఎంఆర్‌పి ఉన్న 180 ఎంఎల్‌పై రూ. 20లు, రూ. 200 లోపు ఎంఆర్‌పి ఉన్న 375 ఎంఎల్‌పై రూ. 40,లు, రూ. 200 లోపు ఎంఆర్‌పి ఉన్న 750 ఎంఎల్‌పై రూ. 80ల ధరలను పెంచారు. రూ.200ల కంటే ఎక్కువ ఎంఆర్‌పి ఉన్న 180 ఎంఎల్‌పై రూ.40లు, రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్‌పి 375 ఎంఎల్‌పై రూ. 80లు,రూ. 200 కంటే ఎక్కువ ఎంఆర్‌పి ఉన్న750 ఎంఎల్‌పై రూ. 160లను ప్రభుత్వం పెంచింది. మద్యం ఎంఆర్‌పి క్వార్టర్‌పై రూ.10, హాఫ్‌పై రూ. 20, ఫుల్ బాటిళ్లపై రూ. 40 పెరిగింది. అన్ని రకాల బీర్ బాటిల్ ఎంఆర్‌పిపైన రూ.10లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా ధరల పెంపు కారణంగా బుధవారం రాత్రి విక్రయాలు ముగిసిన తర్వాత రాష్ర్టంలోని అన్ని వైన్స్, బార్, రెస్టారెంట్లను ఆబ్కారీ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఆయా దుకాణాల్లో ఉన్న స్టాక్ వివరాలను కూడా సేకరించారు. ఇప్పటికే దుకాణదారులు మద్యం డిపోల నుంచి తెచ్చుకున్న స్టాక్‌కు కొత్త ధరలు అమలు చేయడంలో భాగంగా వివరాలు తీసుకున్నారు. నూతన ధరల ప్రకారం ఆ స్టాక్‌కు అనుగుణంగా దుకాణదారులు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అమలులోకి మద్యం ధరలు
RELATED ARTICLES