గణతంత్ర ఉత్సవాల్లో సిఎం కెసిఆర్
ప్రజాపక్షం/హైదరాబాద్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని గురువారం ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి సిఎం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను సిఎం గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతిరాథోడ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, మధుసూధనా చారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజనీకుమార్, సిఎంఒ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్‌మైదానంలోని అమర జవానుల స్తూపం వద్ద కెసిఆర్ నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా దేశం కోసం అమరజవానుల త్యాగాలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు.
అమరుల త్యాగాలు ఎప్పటికీ గుర్తుంటాయ్
RELATED ARTICLES