10 ఏళ్ల వయసులోనే స్వర్ణం, ఖేలో ఇండియా యూత్ గేమ్స్
పూణే: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో యువ ఆటగాడు అభినవ్ షా సంచలనం సృష్టించాడు. 10 ఏళ్ల వయసులోనే స్వర్ణం గెలుచుకుని రికార్డు సృస్టించాడు. ఆదివారం ఇక్కడ జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో వెస్ట్ బెంగాళ్ తరఫున మెహెలీ ఘోస్‌తో కలిసి అభినవ్ షా పసిడి కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం అభినవ్ షా ఆరో తరగతిలో చదువుతున్నాడు. అయితే ఆటకు తన వయసుతో సంబంధంలేదంటూ నిరూపిస్తూ అద్భుత ప్రదర్శన చేశాడు. తనకంటే అనుభవగ్నులైన ఆటగాళ్లతో పోటీపడి ఈ విభాగంలో తమ టీమ్‌ను విజేతగా నిలిపాడు.
అభినవ్ షా సంచలనం
RELATED ARTICLES