టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ నదీ జలాల వివాదాల పరిష్కారానికి అవకాశం ఉన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 5వ తేదీ కాకుండా 20వ తేదీ తరువాత నిర్వహించాలని సిఎం కెసిఆర్ కోరడం కుట్ర కాదా? అని టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశా రు. తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ఎపి ప్రభుత్వం చేపడుతున్న పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు టెండర్ల ఖరారు చేసే ప్రక్రియ ఆగస్టు 19వ తేదీకి పూర్తవుతుందన్నారు. సిఎం కెసిఆర్ మాత్రం 20వ తేదీ తరువాత అపెక్స్ కౌన్సిల్ వాయిదా కోరడా న్ని చూస్తుంటే టెండర్ల ప్రక్రియల వెనుక ఏదైనా మతలబు ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలపై సిఎం కు చిత్తశుద్ధి ఉంటే ఈనెల 5వతేదీనే కేంద్ర జలశక్తి, తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు సభ్యులు గా ఉండే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలని డిమాండ్ చేశారు. జూమ్ యాప్ ద్వారా శనివారం ఆయన తన నివాసంలో నుండి ఆన్లైన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎపి ప్రభు త్వం పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తి పోతల పథకం పూర్తయితే శ్రీశైలం జలాశయం పైనుండే రోజుకు పది టిఎంసిల నీటిని తరతలించుకుపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. దక్షిణ తెలంగాణకు గ్రావిటీ ద్వారా రావాలసిన ఆరు టిఎంసిల నీరు ఆగిపోతాయని, నాగార్జునసాగర్, పాలమూరు రంగారెడ్డి, ఎఎంఆర్, కల్వకుర్తి, వంటి ప్రాజెక్టులకు చుక్క నీరు రాదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు కాళేశ్వరం ద్వారా కేవలం రెండు టిఎంసిల నీటిని ఎత్తిపోసేందుకు రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి ప్రచారార్భాటం చేశారని, మరోవైపు తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా రావాల్సిన ఆరు టిఎంసిల నీటిని ఎపి అడ్డుకుంటుంటే కెసిఆర్, ఆయన మంత్రులు ఒక్క మాట అనడం లేదన్నారు. గతంలో కెసిఆర్ ఎపికి వెళ్ళి రాయలసీమను రతనాలసీమగా మార్చుతానన్నాడని, దానికేమి అభ్యంతరం లేదని, కాని తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టడాన్ని మాత్రం చూస్తూ ఊరుకోబోమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.
జగన్‌కు కెసిఆర్ డబ్బులిచ్చారు. తెలంగాణ ప్రజల సొమ్మును జగన్‌కు కెసిఆర్ ఎన్నికల సాయం చేశారని చాలా మంది మాట్లాడుకుంటున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. వారిద్దరు చాలా మార్లు కలుసుకొని విందులు చేసుకున్నారని, ఆ భేటీలలో రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడుసామర్థ్యంపై కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆ రెండు ప్రాజెక్టుల పనులు ప్రారంభమైన రోజే తెలంగాణ ప్రయోజనాలను కాపాడనందుకు బాధ్యత వహిస్తూ సిఎం కెసిఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టులను ఆపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని, సెప్టెంబర్‌లో పార్లమెంటు సమావేశంలో లేవనెత్తుతానని ఉత్తమ్ వెల్లడించారు.
అపెక్స్ కౌన్సిల్ వాయిదా కోరడం కుట్రే
RELATED ARTICLES