ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్
ఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత్ స్వర్ణంతో పతకాల ఖాతా తెరిచింది. ఢిల్లీ వేదికగా శనివా రం ప్రారంభమైన షూటింగ్ ప్రపంచప్ పోటీల్లో భారత స్టార్ షూటర్ అపూర్వి చండీలా రైఫిల్ అండ్ పిస్టల్ విభాగంలో పసిడి గెలుచుకుంది. శనివారం ఇక్కడ జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫి ల్ విభాగంలో అపూర్వి కొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.ఫైనల్లో మొత్తం 252. 9 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్న అపూర్తి కొత్త వరల్ రికార్డును కూడా నమోదు చేసింది. ఫలితంగా వరల్డ్‌కప్ షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలోభారత్ తరఫున స్వర్ణం గెలుచుకున్న రెండో షూటర్‌గా అపూర్వి రికార్డుల్లో నిలిచింది. అంతకుముం దు అంజలీ భగవత్ ఈ ఫీట్ సాధించింది. కాగా, వరల్డ్‌కప్‌లో అపూర్వికి ఇది మూడో పతకం. గత ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్ పోటీల్లోనూ అపూర్వి రజత పతకాన్ని సాధించింది. ఇక ఈ తాజా వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున అపూర్వి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. చైనా రజత, కాంస్య పతకాలు దక్కించుకుంది. జొహో రుజు(251.8 పా యింట్లు) రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొం తం చేసుకోగా.. మరో చైనా షూటర్ ఝు హాం గ్(230.4) పాయింట్లతో మూడో స్థానంలో నిలి చి కాంస్యాన్ని దక్కించుకుంది. భారత్‌కు తొలి బ ంగారు పతకాన్ని అందించిన అపూర్వి చండీలా తన స్వర్ణాన్ని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు అంకీతం చేస్తున్నట్టు ప్రకటించింది.
అపూర్వికి స్వర్ణం
RELATED ARTICLES