జి20 సదస్సులో ప్రపంచ నేతలకు మోడీ పిలుపు
రెండు రోజుల ప్రతిష్టాత్మక సమావేశం షురూ
రిషిసునక్ సహా పలు దేశాల నాయకులతో భారత ప్రధాని ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ : అపనమ్మకానికి స్వస్తి చెబుదామని ప్రపంచ దేశాల నాయకులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన 18 వ జి శిఖరాగ్ర సమావేశాల ప్రారంభోత్సవ సభలో మోడీ శనివారం ఉదయం మాట్లాడుతూ ప్రపంచ దేశాల నాయకులు ఇకపై అపనమ్మకానికి స్వస్తిచెప్పి, విశ్వాస లోటు భర్తీచేసుకుందామని కోరారు. ఉక్రేన్‌లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఒక స్పష్టమైన తీర్మానం సదస్సు చేయకపోతే సదస్సుకు సంపూర్ణత్వం చేకూరని పరిస్థితుల్లో మోడీ ప్రపంచ నాయకులకు పిలుపు ఇస్తూ ఇకపై విశ్వాసంతో ఉందామన్నారు. 55 దేశాల సభత్వం ఉన్న ఆఫ్రికన్ యూనియన్ (ఎయు) కు జి శాశ్వత సభ్యత్వాన్ని ఇస్తూ తీర్మానం చేసింది. దీంతో జి ఆఫ్రికా యూనియన్ సభ్యదేశంగా మారింది. “కొవిడ్ మహమ్మారిని మనం అధిగమించాం, అలాటప్పుడు ఈ సంక్షోభ పరిస్థితులలో విశ్వాస లోటును, అపనమ్మకాన్ని ఎందుకు అధిగమించలేం? ఇక ప్రపంచ దేశాలమధ్య అపనమ్మకానికి స్వస్తి చెబుదాం, ఆ స్థానంలో విశ్వాసం సాధిద్దాం” అంటూ “సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. జి సదస్సులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అటు వెబ్‌సైట్లలోనూ, ఇటు ప్రచారం సందర్భంగాను, జి వేదికలవద్దా ప్రపంచదేశాల నాయకులకు సుపరిచితమైన “ఇండియా” పేరుకు బదులు “భారత్” అనే పేరుకే ప్రాచుర్యం కల్పించింది. సదస్సులో బల్లపై ప్రధానమంత్రి కూర్చున్న చోట మనదేశ పతాకంతోపాటు అక్కడ “భారత్” అని రాసి ఉండటం గమనార్హం. జి సమావేశాల సందర్భంగా ఢిల్లీ వీధుల్లో మురికివాడలు కనిపించకుండా రహదారులవెంట పరదాలు కట్టడం, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించకపోవడం, భారత్ పేరుకు ప్రాచుర్యం ఇవ్వడం దేశంలో వివాదాస్పదంగా మారింది.
జి సదస్సుకు రెండు అగ్రదేశాలైన రష్యా, చైనా అధ్యక్షులు వ్లదిమీర్ పుతిన్, జీ జిన్‌పింగ్ ఇద్దరూ వేర్వేరు కారణాలతో హాజరుకాకపోవడం, వారి తరపున వరుసగా ఆ దేశాల విదేశాంగమంత్రి, ప్రధానమంత్రి హాజరుకావడంలో సదస్సు చివరిలో ఉక్రేన్ యుద్ధాంశంపై చేయవలసిన కీలక తీర్మానంలో సంపూర్ణత్వం, సమగ్రత లోపించే అవకాశాలు కనిపిస్తూ
ఉండటంతో అపనమ్మకాన్ని పక్కకు నెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ దంపతులు, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా, జపాన్ ప్రధానమంత్రి పుమియో కిషిడా, సౌదీ అరేబియా రాజు ప్రిన్స్ మహ్మమ్మద్ బిన్ సల్మాన్, టర్కిష్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ యేఓల్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయీజ్ ఇనాసియో లులా డసిల్వా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, కాబోయే ఆమె రాజకీయ వారసురాలు సైమావాజేద్, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఆయన కుమారుడు కాయేసంగ్ పంగరెప్ సహా 40 దేశాల నాయకులు, ప్రపంచ బహుళ ప్రయోజనకర సంస్థల అధిపతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఒకవైపు నాయకులు జి సమావేశంలో బిజీగా ఉంటే వారి కుటుంబ సభ్యులు మాత్రం తాజ్ మహల్, ఢిల్లీ బజారుల్లో పర్యటనలు చేస్తూ సరదాగా గడిపారు. ఈ జి సదస్సు సమావేశాల్లోనే జి అధ్యక్ష బాధ్యతలను భారతదేశం నుండి బ్రెజిల్ దేశం స్వాధీనం చేసుకుంటుంది. జి మొత్తం సభ్యదేశాలన్నింటినీ కలిపితే ప్రపంచవ్యాప్తంగా 85 శాతం ఆర్థిక ఉత్పత్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రపంచ వాణిజ్యంలో ఈ దేశాల వాటా 75 శాతంగా ఉంది. అదేవిధంగా ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతున జనాభా ఈ సభ్యదేశాల్లోనూ జీవనం సాగిస్తున్నారు. దేశాలమధ్య ఆర్థిక ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ, వాణిజ్య విస్తరణ, వాతావరణ మార్పుల ప్రమాదంపై తిరిగి అర్థవంతమైన చర్చలు, పేద దేశాలకు ఆర్థిక సహాయం అందించే అంశాలను సులభతరం చేయడం వంటి అనేక అంశాలను ఈ సమావేశం చర్చకు స్వీకరిస్తుంది.
మొరాకో భూవిలయంపై
సంతాపం,సహాయం
ఆఫ్రికాదేశం మొరాకోలో సంభవించిన భూ విలయంలో సుమారు 9౦౦ మంది మరణించిన ఘటనపై జి సదస్సు తీవ్ర సంతాపం ప్రకటించింది. భూ కంపం సంభవించచిన మొరాకో దేశానికి జి అండగా ఉంటుందని సదస్సు తీర్మానం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సదస్సులో మొరాకో భూకంప ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మొరాకోదేశానికి తగిన సహాయం అందించడానికి యావత్ ప్రపంచం సిద్ధంగా ఉందని మోడీ ప్రకటించారు. ఇకమీదట ఆఫ్రికా యూనియన్ జి సభ్యదేశంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సభ్యత్వం ఇవ్వడం అనేది జి అధ్యక్షబాధ్యతల్లో ఉండగా భారతదేశం సాధించిన ఘనతేనని ఆయన అన్నారు. “ప్రపంచానికి మంచి చేయడం కోసం మనం అందరం కలిసి నడుద్దాం” అని నరేంద్రమోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాదికాలంలో 60 నగరాలలో జి సమావేశాలు నిర్వహించామని, కోట్లాదిమంది భారతీయులు ఈ సమావేశాల్లో భాగస్వామ్యమయ్యారు, సుమారు 20౦ పైగా సదస్సులు, సమావేశాలు ఈ వెంట్లు నిర్వహించామని అన్నారు. ఆర్థికరంగంలో ఉత్తర దక్షిణ విభజన, ఆహారం దగ్గర నుండి ఇంధనం వరకూ ఉగ్రవాదం నుడి సైబర్ సెక్యూరిటీ వరకూ ప్రపంచదేశాలన్నీ సమస్యలను అధిగమించి నిర్మాణాత్మకమైన ఏకాభిప్రాయాల దిశగా పయనించవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. అదేవిధంగా ప్రపంచంలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న పాత సమస్యలన్నింటికీ కొత్త పరిష్కారాలు సాధించవలసిన అవసరం ఉందని అన్నారు.
ఇదిలా ఉంగా, జి సమావేశాలకు హాజరైన వివిధ దేశాల నాయకులతో నరేంద్రమోడీ ద్వైపాక్షిక చర్చల్లో మునిగితేలారు. ముందుగా శుక్రవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోడీ తన నివాసంలో విందు సమావేశం నిర్వహించారు. నాసా మధ్య భవిష్యత్‌లో మరింత సన్నిహితంగా సహకారం కొనసాగించాలని నిర్ణయించారు. ఇస్రో సాధించిన వరుస విజయాలను ఈ సందర్భంగా బైడెన్ ప్రశంసించారు. శనివారంనాడు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.. వారి చర్చల్లో ఎఫ్‌టిఎ అంశం ప్రధానంగా చోటు చేసుకుంది. భద్రతామండలిలో రాబోయేకాలంలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చే విషయంపై కూడా మోడీకి బైడెన్ భరోసా ఇచ్చారు.
అపనమ్మకాన్నివదిలేద్దాం
RELATED ARTICLES