HomeNewsBreaking Newsఅన్నదాతల ఆగ్రహం

అన్నదాతల ఆగ్రహం

క్వింటాకు రూ.600కుపైగా కోత ధాన్యం ధర తగ్గింపుపై సూర్యాపేట వ్యవసాయ కార్యాలయం ముట్టడి
ప్రజాపక్షం/సూర్యాపేట రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పం టకు ధర తగ్గించి అడ్డికి పావు సేరులా కోనుగోలు చేస్తుండటంతో ఆగ్రహించిన అన్నదాతలు శనివారం సూర్యాపేట వ్యవసాయ మా ర్కెట్‌ కార్యాలాయాన్ని ముట్టడించారు. ప్రభు త్వం క్వింటాకు 1960 రూపాయలు ప్రకటించగా.. కేవలం 1200 రూపాయలకు కోనుగోలు చేయడం ఏమిటని వ్యాపారులను నిలదీశారు. రైతు సంక్షేమం కోసం పాటు పడాల్సిన పాలకవర్గ సభ్యులు, అధికారులు వ్యాపారుల చేతిలో కీలుబొమ్మలుగా మారారని రైతులు ఆరోపించారు. శనివారం మార్కెట్‌కు 26వేల బస్తాల వరి ధాన్యంను రైతులు అమ్మకానికి తీసుకురాగా, కోనుగోలు చేసేందుకు కేవలం ఐదుగురు రైస్‌ మిల్లర్స్‌, 18 మంది ట్రేడర్స్‌ మాత్రమే ముందుకు వచ్చారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో 16 మంది రైస్‌ మిల్లర్స్‌ రైతుల ధాన్యంను కోనుగోలు చేస్తుండగా… సిండికేట్‌గా మారి కేవలం ఐదుగురు మాత్రమే కొనుగోళ్ల కోసం ముందుకు వచ్చా రు. 45 మంది ట్రేడర్లు ఉండగా… వీరిలో కేవలం 18 మంది మాత్రమే రైతుల ధాన్యాన్ని కమిషన్‌ పద్ధతిలో కొనుగోలు చేసేందుకు రావడం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా 600 రూపాయలకు పైగా తగ్గించి కొనుగోలు చేస్తామని వ్యాపారులు చెప్పడంతో అవాక్కయిన రైతులు, వారి దోపిడీని అరికట్టాలని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎండి ఫషియుద్దీన్‌, వ్యాపారులు, రైతులతో సమావేశమయ్యారు. రైతుల గోడును విన్న ఆయన ధర పెంచి కొనాలని వ్యాపారులకు చెప్పడంతో… ధాన్యంలో తేమ శాతం బాగా ఉన్నదని, మార్కెట్‌ ఇనామ్‌ పద్ధతిని అమలు చేస్తున్నారుగా, తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం ధర ఎలా ఉందో మీరే చూడండి అంటూ వ్యాపారులు వాదనకు దిగడంతో చర్చలు ఆర్ధాంతరంగా ముగిశాయి. వ్యాపారులు ధాన్యం కొనుగోలు విషయంలో మొండికి వేయడంతో ఆగ్రహించిన రైతులు.. మరోమారు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి వ్యవసాయ మార్కెట్‌కు హుటాహుటిన విచ్చేశారు. రైతులతో సమావేశమైన ఆయన వ్యాపారులను పిలిపించి ధర విషయంలో మరోమారు పునః పరిశీలించుకోవాలని, రైతులకు నష్టం జరిగేలా చేస్తే బాగోదని హెచ్చరించారు. కలెక్టర్‌ అదేశాలతో దిగివచ్చిన వ్యాపారులు 1200 నుండి 1400 రూపాయల వరకు కోనుగోలు చేస్తామని, క్వింటాకు మరికొంత ధర పెంచి కొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments