ప్రజాపక్షం/హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మెపై న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేకపోవడం సిగ్గుచేటని ఆర్‌టిసి జెఎసి కన్వీనర్ ఇ.అశ్వద్ధామరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్‌టిసి సంస్థను ముంచేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో జెఎసి కో కన్వీనర్లు ఎస్.బాబు, సుధాతో కలిసి శుక్రవారం అశ్వద్ధామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాపితంగా అన్ని డిపోల ముందు శనివారం ర్యాలీలను నిర్వహిస్తామన్నారు. మిలియన్ మార్చ్‌కు కార్యాచరణను రూపొందిస్తున్నామని తెలిపారు. ఆర్‌టిసిని రక్షించాల్సిన అధికారులు ప్రభుత్వం చెప్పుచేతుల్లో ఉన్నారన్నారు. అధికారులు ఇంతకు ఆర్‌టిసి సంస్థను రక్షించడానికి ఉన్నారా..? అమ్ముకోడానికా అని ప్రశ్నించారు. 28 రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస స్పందన లేదన్నారు. కోర్టులో ఆర్‌టిసి యాజమా న్యం దాఖలు చేసిన అఫిడవిట్ మున్సిపల్ శాఖ తరపున దాఖలు చేసినట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ఎస్.బాబు మాట్లాడుతూ ఆర్‌టిసి అధికారులు న్యా యస్థానంలో దోషిలా నిలబడ్డారన్నారు. ఆర్‌టిసి అధికారులు ఎవరికోసం పనిచేస్తున్నారని,వారు తప్పుడు సమాచారం ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు జెఎసితో కలిసి రావాలని కోరారు. సుధా మాట్లాడుతూ కోర్టులో ఒకే ప్రశ్నకు నాలుగు రకాల సమాధానాలు వచ్చాయని, అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడం సరైంది కాదని తెలిపారు.
అధికారుల వద్ద సమాధానం లేకపోవడం సిగ్గుచేటు
RELATED ARTICLES