తహశీల్దార్ కార్యాలయం వద్ద యువరైతు ఆత్మహత్యాయత్నం
తప్పుల తడకగా ఉన్న పట్టా పాస్‌పుస్తకాలపై అన్నదాతల ఆందోళన
ప్రజాపక్షం/ హుస్నాబాద్ : అధికారుల నిర్లక్ష్యంపై రైతులు కన్నెర్రజేశారు. పట్టాపాసు పుస్తకాలు రాకపోవడంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొహెడ మండలం వింజపల్లి గ్రామరైతులు మండిపడ్డారు. కొందరికి వచ్చినా అందులో తప్పుల సవరణపై ఏళ్ల తరబడి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదం టూ బుధవారం 40మందికి పైగా రైతులు తహశీల్దార్ అనిల్‌కుమార్ నిర్లక్ష్య వైకరిని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. పొట్ట చేతపట్టుకొని ఆరుగాలం శ్రమించే రైతులపై ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు రెవె న్యూ అధికారులు మామూళ్ల మత్తులో తూగుతూ రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వింజపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో దాదాపు 1440 పైగా ఖాతాలు కలిగి ఉన్న రైతులకు 500 వందల వరకు పట్టా పాసుపుస్తకాలు మాత్రమే ఇవ్వగా, ఇచ్చిన పాస్ పుస్తకాల్లో భూ వివరాలు పూర్తిగా నమోదుకాలేదు. మరికొంతమంది రైతులకు పాస్ పుస్తకాలను ఇవ్వక అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అధి కారుల నిత్యం చెప్పిందే చెప్పడం వల్ల విసుగు చెందిన గ్రామ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి 314, 315 సర్వే నెంబర్‌లో 2 ఎకరాల 19 గుంటల భూమిని పక్క గ్రామానికి చెందిన వ్యక్తికి ఈ ఏడాది జనవరిలో తహాశీల్దార్ పట్టా చేశారని, తిరిగి దానిని తనపై మార్చలని అధికారులను కోరగా భూసర్వేలు చేయాలని రోజలు తరబడి జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదే గ్రామానికి చెందిన మూత్యల రంజిత్‌రెడ్డి (24)కి 295,296,297/జి సర్వే నంబర్లులో భూ వివరాలను సరి చేయాలని హుస్నాబాద్ ఆర్‌డిఒ ముందు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విన్నవిస్తే అనిల్‌కుమార్ మూడు రోజుల్లో పూర్తిచేస్తనని చేప్పి ఐదు నెలలు గడుస్తునాన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గ్రామంలోని అనే క మంది రైతు సమస్యలపై అధికారుల స్పందన కరువైందని, వారి తీరుపై విసుకు చేందిన రంజిత్‌రెడ్డి తండ్రి రవిందర్‌రెడ్డి తహశీల్దార్ కార్యాలయంలో పురుగుల మందు సేవించి ఆత్యహత్యాయత్నం చేశారు. సమాచా రం అందుకున్న అధికారులు రైతు రంజిత్‌ను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. రెవెన్యూ అధికారులు తీరుపై మండల రైతులు స్థానికులు అనేకంగా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైన జిల్లా పాలనధికారి స్పందించి రెవెన్యూ అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.