పాట్నా ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్
పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రైతుల రుణమాఫీ చేస్తామని, ఆహార శుద్ధి పరిశ్రమకు ఊతం ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంట బీమా పథకం ‘రైతుల కష్టార్జితాన్ని కాజేసి బడా వ్యాపారవేత్తల జేబులు నిం పేందుకు లక్ష్యంగా పెట్టుకున్నది’ అని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. నితీశ్ ప్రభు త్వం ‘శుష్క వాగ్దానాలు చేస్తోందన్నారు. ఒకవేళ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో కాంగ్రెస్ తొలి ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రధాని మోడీని సూచిస్తూ దేశానికి ‘కాపలాదారుడు దొంగ’(చౌకీదార్ చోర్ హై) అని నినదించారు. రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందన్నారు. పంట బీమా పథకం సహా మోడీ విధానాలన్నీ ‘రైతుల కష్టార్జితాన్ని తీసేసుకుని పెద్ద వ్యాపారవేత్తల జేబులు నింపడానికి ఉద్దేశించినవే’ అన్నారు.‘రైతులకు కావలసింది మేము చేస్తాం, యువతకు ఉపాధి కల్పిస్తాం. రైతుల రుణమాఫీ చేస్తాం. ఆహార శుద్ధి పరిశ్రమను ప్రోత్సహిస్తాం’ అన్నారు. ‘ప్రతి పేదవాడికి కనీస ఆదాయం దక్కేలా కాంగ్రెస్ చూస్తుందన్నారు.2014 ఎన్నికలకు ముందు మోడీ ప్రతి ఒక్కరికి రూ. 15 లక్షలు ఇస్తామన్నట్లు బూటకపు వాగ్దానాలను తమ పార్టీ చేయదు’ అన్నారు. ‘మార్పు గాలులు వీస్తున్నాయి. మిత్రపక్షాలతో కలసి కాంగ్రెస్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎనికల్లో కూడా మేము మిత్రపక్షాలతో కలసి విజయం సాధిస్తాం’ అన్నారు. మోడీ విధానాలకు భిన్నంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తమ కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి న కొన్ని రోజులకే రైతుల రుణాలు మాఫీ చేశాయన్నారు. ఈ ర్యాలీలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు. వీరేకాక మిత్రపక్షం ఆర్‌జెడికి చెందిన తేజస్వీ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాన్ఝి కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ‘ఆయన(మోడీ) అనేక దేశాల్లో పర్యటించారు. రక్షణ ఒప్పందాలు చేసుకుని వచ్చారు. కానీ చివరికి అనిల్ అంబానీ, వంటి ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం కలిగించారు.నాడు రక్షణ మంత్రి గా ఉన్న మనోహర్ పారికర్, భారత వాయుసేన అధికారులు ఒప్పందాన్ని అంగీకరించకపోయినప్పటికీ మోడీ తన పంథాలో ముందుకు వెళ్లారు’ అని రాహుల్ ఆరోపించారు.‘పూర్వం బీహార్ జ్ఞానార్జనకు కేంద్రంగా ఉండేది. నేడది నిరుద్యోగానికి కేంద్రంగా మారింది. ఒకవేళ కేంద్రంలో తమ పార్టీ అధి