పెట్రోల్, డీజిల్‌పై మళ్లీ 80 పైసల చొప్పున పెంపు
ఐదు రోజుల్లో నాలుగోసారి ధరల సవరణ
మొత్తంగా రెండింటిపై రూ. 3.20 చొప్పున భారం
న్యూఢిల్లీ : దేశంలో పెట్రో ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగా రెండవ రోజు కూడా ధరలు పెరిగాయి. ఈనెల 22 నుంచి రోజు వారీ ధరలను సవరించం ప్రారంభించిన చము రు సంస్థలు 80 పైసల చొప్పున భారాన్ని మోపుతున్నాయి. శనివారం కూడా పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల చొప్పున వడ్డించాయి. ధరలు పెరగడం ఐదు రోజుల్లో ఇది నాల్గొవసారి. ఈ నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్‌పై 3.20 చొప్పున పెరిగింది. తాజాగా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.81 నుంచి రూ. 98.61కి చేరింది. డీజిల్ ధర రూ. 89.07 నుంచి రూ. 89.87కు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నోటిఫికేషన్‌ను జారీ చేశాయి. జూన్ 2017 నుంచి రోజువారీ ధరలను సవరించడం ప్రారంభించిన నాటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి. కాగా, 137 రోజుల ధరల సవరణ విరామానికి ము గింపు పలికి ఈనెల 22 నుంచి మళ్లీ చమురు సంస్థలు మళ్లీ పెట్రోల్, డీజిల్‌పై 80 చొప్పున ధరలు పెంచుతూ వస్తున్నాయి. దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఉన్నందున ధరలను నవంబర్ 4వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు సవరించడం ఆపేశారు. ఈ కాలంలో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్‌కు 30 యుఎస్‌డిలు పెరిగింది. మార్చి 10న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పెట్రో ధరలు పెరుగుతాయని అందరూ ఊహించారు. ఇప్పుడు అదే నిజమైంది. గత నష్టాలను చమురు సంస్థలు ఇప్పుడు పూడ్చుకోవడం షురూ చేశాయి. ఐఒసి, బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ కలిసి దాదాపు 2.25 బిలియన్ యుఎస్‌డిలు నష్టపోయినట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ పేర్కొంది. క్రూడ్ అయిల్ ధర ఒక బ్యారెల్‌కు 100 నుంచి 120 యుఎస్‌డిలు పెరిగిందని, దీంతో ఆయిల్ కంపెనీలు డీజిల్‌పై రూ. 13.1 నుంచి 24.9 మధ్య, పెట్రోల్ ధర రూ. 10.6 నుంచి 22.3కు పెంచాల్సిన అవసరముందని కోటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది.
సిగ్గులేకుండా దోపిడీని ఆపండి : కాంగ్రెస్
ఐదు రోజుల్లో నాలుగుసార్లు పెట్రో ధరలు పెంచడంపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రజల నుంచి సిగ్గు లేకుండా దోచుకోవడాన్ని ఆపాలని దుయ్యబట్టింది. ధర పెరుగుదలపై పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కేంద్రాన్ని నిలదీశారు. రాజులు సౌదాలు నిర్మించాలనుకుంటే పరిస్థితులు నేల చూపులు చూస్తున్న చందంగా మోడీ పాలన ఉందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం హయాంలో ద్రవ్యోల్బణం ‘తేదీ మాత్రమే కొత్తది… సమస్య పాతదే’ అన్నట్లుగా ఉందని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా హీందీలో ట్వీట్ చేశారు. నవభారతంలో నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలను సరికొత్తగా చూడాల్సి వస్తోందని ఎద్దేవ చేశారు.
అదే బాదుడు…
RELATED ARTICLES