ముంబయి : ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఆ మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ మండలి 15 మందితో కూడిన జట్టును ఇటివలే ప్రకటించింది. అయితే ప్రపంచకప్‌లో ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారనేది ఇంకా నిర్ణయించలేదని, కొన్ని రోజుల్లో అది కూడా నిర్ణయిస్తామని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చెప్పాడు. భారత జట్టులో చాలా రోజులుగా నాలుగో స్థానం బ్యాట్స్‌మెన్‌పై సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నాలుగో స్థానంలో వస్తాడన్న జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన కోహ్లీ.. అది ఇప్పుడే నిర్ధారించలేమని పేర్కొన్నాడు. విజయ్‌తో పాటు కెఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, కేదర్ జాదవ్ కూడా ఉన్నారు. కాబట్టి ప్రపంచకప్‌లో ఎవరే స్థానంలో బ్యాటింగ్ చేస్తే ఉపయోగం ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నాడు. విజయ్ ఎంపిక గురించి మాట్లాడుతూ.. అన్ని విషయాలు చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని అన్నాడు. ఇక నాలుగో నంబర్‌లో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారనేది నిర్ణయించడానికి ఇంకా సమయం ఉందని కోహ్లీ తెలిపాడు.
అది ఇంకా నిర్ణయించలేదు : కోహ్లీ
RELATED ARTICLES