ప్రజాపక్షం/హైదరాబాద్ :బాలిక సమ్మతితోనే లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నానని, దీనిని అత్యాచారంగా పరిగణించవద్దని దోషి చేసిన అప్పీల్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. బాలిక అంగీకారం చెప్పినప్పటికీ చట్ట ప్రకారం బాలికతో లైంగిక సంబంధం పెట్టుకోవడం అత్యాచారమే అవుతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డిల డివిజన్ బెంచ్ ఇటీవల తీర్పు చెప్పింది. వరంగల్ జిల్లా మరిపేడ పీఎస్ పరిధిలో 2014 అక్టోబర్‌లో నమోదైన బాలికపై అత్యాచార కేసులో వరంగల్ జిల్లా కోర్టు దోషి బానోతు రవికి యావజ్జీవ శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ జడ్జిమెంట్ చెప్పింది. ఈ తీర్పును రద్దు చేయాలని, బాలిక అంగీకరంతోనే లైంగికంగా కలిశామని రవి హైకోర్టును అప్పీల్ పిటిషన్ ద్వారా వాదించారు. ఈ వాదనతో ఏకీభవించని హైకోర్టు.. యావజ్జీవ శిక్షను పదేండ్లకు తగ్గించింది. పోక్సో, ఐపీసీల కింద నేరం రుజువు అయ్యిందని, పెరోల్ ఇవ్వకుండానే శిక్షను అమలు చేయాలని, ఇప్పటి వరకూ జైల్లో ఉన్న కాలాన్ని శిక్ష అనుభవించినట్లుగా పరిగణించాలని తీర్పులో స్పష్టం చేసింది.
అది అత్యాచారమే : తేల్చిచెప్పిన కోర్టు
RELATED ARTICLES