HomeNewsBreaking Newsఅదానీపై మౌనం కుమ్మక్కే

అదానీపై మౌనం కుమ్మక్కే

ఇక రోజూ మోడీకి మూడు ప్రశ్నలు
మీరేదీ దాచిపెట్టలేరు : కాంగ్రెస్‌
న్యూఢిల్లీ :
హిండెన్‌బర్గ్‌ నివేదిక, అదానీ కృత్రిమ గణాంకాల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌పార్టీ తన దాడి మరింత ఉధృతం చేసింది. అదానీ విషయంలో మోడీ, ఆయన ప్రభ్తుత్వం పాటిస్తున్న సుదీర్ఘమైన మౌనం కుమ్మక్కు అయిన విషయాన్నే ధ్వనిస్తోందని, దీనిపై తమ నుండి ఎదురయ్యే ప్రశ్నల నుండి సమాధానాలను మోడీ, ఆయన ప్రభుత్వం రహస్యంగా దాచిపెట్టలేదని కాంగ్రెస్‌పార్టీ హెచ్చరించింది. జనవరి 24న అమెరికా కేంద్రగా పనిచేసే హిండెన్‌బర్గ్‌ అదానికి సంధించిన ప్రశ్నల నేపథ్యంలో దేశంలో పెద్ద సంక్షోభం చెలరేగింది. అదానీ ఆసియాలో అపరకుబేరుల ప్రథమస్థానం నుండి 17 వ స్థానానికి దిగజారిపోయారు. రూ.8.50 లక్షలకోట్ల ధనం ఆవిరయ్యింది. పేదల పొదుకు సందేహంలో పడింది. కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేష్‌ ఆదివారం ఒక ప్రకటన చేస్తూ, అదానీ సమస్యపై కాంగ్రెస్‌పార్టీ ప్రతిరోజు నరేంద్రమోడీకి మూడు ప్రశ్నలు వేస్తుందని, ఈ ప్రశ్నల నుండి ఇక మోడీ
తప్పించుకోలేరని హెచ్చరించారు. మోడీ, ఆయన ప్రభుత్వం ఇక ప్రశ్నల నుండి రహస్యాలు దాచిపెట్టలేదని పేర్కొంటూ “మనలో ధనవంతుడు ఎవరు?” అని పేర్కొంది. గడచిన పదిరోజులుగా మోడీ ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నప్పటీ ప్రభుత్వం సుదీర్ఘ మౌనం పాటిస్తోందని, ఈ సుదీర్ఘమౌనం అదానీతో కుమ్మక్కుతో సమానమని విమర్శించింది. 2016 ఏప్రిల్‌ 4న పనామా పేపర్లు బయటపడ్డాయని, దానికి సమాధానంగా, ‘మోడీ వ్యక్తిగతంగా ఈ ఆర్థిక తప్పిదాలపై, విదేశాల్లో డబ్బులు దాచుకోవడంపై పలు దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ, చెప్పిందని జై రామ్‌ రమేష్‌ గుర్తు చేశారు. ఆ తర్వాత 2016 సెప్టెంబరు 5న చైనా హంగ్ఝోలో జరిగిన జి సదస్సులో కూడా, “ఆర్థిక నేరగాళ్ళు చేసే తప్పిదాలను, వారి స్వర్గథామాలను నిర్మూలించడానికి ఒక చట్టం చేయవలసిన ఆవశ్యకత ఉందని చెరప్పారని గుర్తు చేశారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ నియంత్రణల సాలెగూడును బద్దలు కొట్టి హవాలా నేరగాళ్ళను, ఆ సొమ్మును దేశానికి రప్పించాలంటే చట్టం కావాలని చెప్పారని, ఈ నేపథ్యంలో “మనలో అదానీ ఎవరు?” అనే ప్రశ్నల నుండి మోడీ ప్రభుత్వం సమాధానాలను దాచిపెట్టలేదని, ప్రభుత్వం చేసిన పూర్వ ప్రకటనలు అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయని జైరామ్‌ రమేష్‌ అన్నారు. ఆనాడు బహిర్గతమైన పనామా పేపర్లలో గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ పేరు ఉందని, బహమాస్‌, బ్రిటిస్‌ విర్జిన్‌ ఐలాండ్స్‌ నుండి ఈ ఆర్థిక నేరాల లావాదేవీలు నిర్వహిస్తున్నది ఎవరో ఆనాడే బయటపడిందని అన్నారు. అత్యంత అప్రదిష్టకరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపార వర్గాల వారితో మోడీకి సాన్నిహిత్యం ఉందని అన్నారు. “మీరు తరచు చిత్తవుద్ధి గురించి, అవినీతిపై పోరాటం గురించీ మాట్లాడతారు, దేశాన్ని పణంగా పెట్టి అవినీతి వ్యతిరేక ప్రచ్ఛాళణ పేరుతో పెద్ద నోట్లు రద్దు చేశారు, అనేక సంవత్సరాలుగా అవినీతి నిర్మూలన పేరుతో సిబిఐ, ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ దుర్వినియోగం చేశారు, రాజకీయ ప్రత్యర్థులపై వాటిని ప్రయోగించారు, మీ స్వీయ ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు ఆశ్రిత పెట్టుబడిదారుల హోదాలో ముందుకు రాకుండా మిన్నకుండిపోయిన పెద్ద వాణిజ్య కేంద్రాలను శిక్షించారు, ఇక ఇప్పుడైనా అదానీ విషయంలో నిజాయతీగా, న్యాయబద్ధంగా విచారణ జరిగే అవకాశం ఉందా?” అని ఆయన ప్రశ్నించారు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడాదీర్ఘకాలంగా ఎలాంటి పరిశీలన లేకుండా పెద్ద వ్యాపార సంస్థ ఎలా తప్పించుకోగలిగిందని, ఏ విధంగాదేశంలో అతిపెద్ద వ్యాపార కేంద్రాలలో ఒకటైన గ్రూపును అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు నిర్మించేందుకు ఏకపక్ష అధికారాలు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments