ప్రజాపక్షం / హైదరాబాద్ : అందరినీ ఆశ్చర్యపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్ (2020- ప్రవేశపెట్టింది. ఇందులో రూ.1.43 లక్షల కోట్లు రెవెన్యూ రాబడిని లక్ష్యంగా పెట్టుకున్న ది. ఇది 2019- కంటే రూ.32 వేల కోట్లు ఎక్కువ. ప్రధానంగా భూముల విక్రయాలు, మద్యం అమ్మకాలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గనులు, ఖనిజాల ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసుకున్నది. మద్యం ద్వారా రూ.16 వేల కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా రూ. 10 వేల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో పేర్కొన్నా రు. ఈ రెండింటిపై ప్రస్తుతం కంటే రూ.8 వేల కోట్లు అదనంగా ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మద్యం ధరలు రెండు నెలల కిందనే పెంచడంతో నెలకు రూ.300 కోట్లకు పైగా అదనపు ఆదాయం వస్తుందని, దీంతో సులువుగా రూ.4వేల కోట్ల లక్ష్యం సాధించవచ్చని ఆర్థిక శాఖ లెక్కలు వేసుకుంటుంది. ఇక త్వరలో భూముల మార్కెట్ విలువ పెంచాలని ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా రూ.4వేల కోట్లు అదనంగా పెరుగుతుందని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. భూముల వేలం ద్వారా రూ.14,515 కోట్ల భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. గనులు, ఇసుక వంటి ఖనిజాల ద్వారా రూ.5,600 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ట్యాక్స్ ద్వారా రూ.4వేల కోట్లు రాబట్టాలని భావిస్తున్నారు.
రాష్ట్ర స్వంత పన్నుల ద్వారా రూ.85 వేల కోట్లు
జిఎస్‌టి వచ్చాక రాష్ట్రానికి స్వంతంగా కేవలం మద్యం, పెట్రోలు, డీజిల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లపైనే పన్నులు వేసుకునే అవకాశం ఉంది. ఈ స్వంత పన్నుల రాబడి కింద ఈసారి కంటే రూ.14వేల కోట్లు ఎక్కువగా 2020 రూ.85 వేల కోట్లు వస్తాయని భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మద్యం విక్రయాలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా రూ.26వేల కోట్లు వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది.కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు రూ.27వేల కోట్లు వస్తాయని అంచనా. ఇందులో కేంద్ర పన్నుల వాటా.16,726 కోట్లు, గ్రాంట్ కింద రూ. 10,525 కోట్లు వస్తాయని భావిస్తున్నారు.మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా సమీక్షించి, భారం తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అదనపు ఆదాయం ఆ నాలుగింటి నుండే
RELATED ARTICLES