‘నిమజ్జనం’ ఆదేశాలను పునఃసమీక్షించడంపై హైకోర్టు స్పష్టీకరణ
హౌస్‌మోషన్‌గా తక్షణ విచారణకు నిరాకరణ..
లంచ్‌మోహన్‌గా ప్రస్తావించాలని రాష్ట్ర సర్కారుకు సూచన
ప్రజాపక్షం/హైదరాబాద్ వినాయక, దుర్గాదేవీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనంపై ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించడం అత్యవసరమేమీ కాదని హైకోర్టు స్పష్టం చేసింది. హౌస్‌మోహన్‌గా రివ్యూ పిటిషన్‌ను స్వీకరించాలని రాష్ట్ర ప్రభు త్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సోమవారం లంచ్‌మోహన్‌గా ఈ అంశాన్ని ప్రస్తావించాలని సూచించింది. హైదరాబాద్ లో గణేశ నిమజ్జనం, తద్వారా ఏర్పడే కాలుష్యంపై హైకోర్టు గత రెండేళ్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ విషయంలో మామిడి వేణుమాధవ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ, ట్యాంక్‌బండ్ హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహానాలను నిమజ్జనం చేయరాదని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ప్రత్యేకంగా బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేసి, వాటిలో మాత్రమే ఈ విగ్రహాలను నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు రాష్ట్ర సర్కారను ఇరుకున పెట్టాయి. వినాయక చవితికి ఒక రోజు ముందు ఆదేశాలు రావడంతో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కష్టతరమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. జిహెచ్‌ఎంసి పరిధిలో సుమారు 35 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించారన్నారు. హైదరాబాద్‌లో ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యంకాదన్నారు. అందుకే, ఈ సంవత్సరం యథావిధిగా విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని కోర్టును కోరారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. విగ్రహాల నిమజ్జనం జరిగిన 48 గంటలలో వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగిస్తామని హామీ ఇచ్చారు. భక్తులు, ఉత్సవాల నిర్వాహకుల మనోభావాలను కూడా పెద్ద మనసుతో కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గణేష్ శోభ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, దేశవ్యాప్తంగా హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ఇలావుంటే, నిమజ్జనంపై ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించేందుకు వీలుగా న్యాయమూర్తి ఇంట్లోనే అత్యవసర విచారణ చేపట్టాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ఇది హౌస్‌మోషన్ కింద విచారణ చేపట్టాల్సినంత అత్యవసరమైన అంశమేమీ కాదని స్పష్టం చేసింది. సోమవారం లంచ్‌మోషన్ పిటిషన్‌గా విచారణకు స్వీకరించే అంశాన్ని పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది.
అత్యవసరం ఏమీ కాదు..
RELATED ARTICLES