2017-18లో బిజెపికి వచ్చిన విరాళాలు రూ.1000 కోట్లు
ఈసికి సమర్పించిన వార్షిక ఆదాయ నివేదికలో వెల్లడి
హైదరాబాద్ : దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీగా బిజెపి అవతరించింది. గత ఆర్థిక సంవత్సరం 2017-18లో బిజెపికి విరాళాల రూపంలో మొత్తం రూ.1000 కోట్లు వచ్చాయి. ఈ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆదాయ నివేదికలో బిజెపి వెల్లడించింది. విరాళాల విషయంలో బిజెపి తర్వాత స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉంది. గతంతో పోలిస్తే బిఎస్పి విరాళాలు రూ.681 కోట్ల నుంచి రూ.717 కోట్లకు పెరిగాయి. 2016-17లో రూ.262 కోట్లుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదాయం రూ.291 కోట్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో సిపిఐ(ఎం) రూ.104 కోట్లు విరాళాలు రాగా, సిపిఐకి రూ.1.5 కోట్లు వచ్చాయి.
అత్యంత సంపన్నమైన పార్టీగా బిజెపి
RELATED ARTICLES