ట్యాంక్‌బండ్‌పై తొలి స్టాల్
నీరా పాలసీ ప్రకటించిన ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రజాపక్షం/హైదరాబాద్: అతిత్వరలో నీరా స్టాల్స్ అందుబాటులోకి తెస్తామని ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాం తాల్లో మొదటిస్టాల్ ఏర్పాటు చేస్తామని చెప్పా రు. టూరిజం ప్లాజాలో ఏర్పాటుచేసిన మీడి యా సమావేశంలో నీరా పాలసీని మంత్రి ప్రకటించారు. మొదటిసారి ప్రభుత్వం ఆధ్వర్యం లో నీరా స్టాల్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఇప్పటివరకు కేరళ, మహారాష్ర్టలలో ఇవి ఉన్నాయని, చెప్పారు. నీరా స్టాల్స్ గౌడ కులస్తులకు మాత్ర మే ఇస్తామని, నీరా అనేది ఉపాధితోపాటు అనేక రకాలుగా ఉపయోగపడుతుందన్నారు. గత ప్రభుత్వాలు కల్లునే నిషేధించారని, తమ ప్రభు త్వం వచ్చాక మళ్లీ తెరిపించామన్నారు. నీరా వలన లక్షల మంది బాగుపడుతారని చెప్పారు. దాదాపు 70 సంవత్సరాల నుండి కూడా గీత కార్మికులపై ఆంక్షలు పెట్టడమే కానీ వారి వృత్తికి సంబంధించి ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదని, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నీరా కోసం ఇతర దేశాల్లో తిరిగారే తప్పగత ప్రభుత్వాలేమి చెయ్యలేదన్నారు. సిఎం కెసిఆర్ గౌడ జాతికి తాటిచెట్లను హరితహారం కార్యక్రమంలో భాగంగా పెట్టారన్నారు. నీరా అమ్మకాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఒక్క స్టాల్ పెట్టి నీరా అందిస్తామని సిఎం కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని కూడా చెప్పారని తెలిపా రు. గౌడ్‌లు మాత్రమే నీరాను గీయడం, అమ్మాలని సిఎం చెప్పారన్నారు.