HomeNewsLatest Newsఅడ్రస్‌ప్రూఫ్‌ తప్పనిసరి

అడ్రస్‌ప్రూఫ్‌ తప్పనిసరి

వాహనదారుల పాస్‌లపై సమీక్ష
నేటి నుంచి మరింత పకడ్బందీగా లాక్‌డౌన్‌
డిజిపి మహేందర్‌రెడ్డి ప్రకటన

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : రాష్ట్రంలో లాకౌడౌన్‌ను ఈనెల 21వ తేదీ నుంచి కఠినంగా అమలు చేస్తామని రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి  ప్రకటించారు.  పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాకౌడౌన్‌ అమలుపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం తీసుకున్న నిర్ణయాలను 21 నుంచి పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారుల నియంత్రణపై నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. అత్యవసర సరుకుల సరఫరాకు కొందరికి పాసులు ఇచ్చామని,  అవసరం లేకున్నా ఆ వాహనదారులు పాసులతో రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు. పాసులు కలిగిన వ్యక్తి తిరగాల్సిన ప్రదేశాలను గుర్తించామని, వాహనదారులకు ఇచ్చిన పాసులపై సమీక్ష చేయాలని నిర్ణయించామని, ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల పాసులను రద్దు చేస్తామని డిజిపి హెచ్చరించారు. పాసు కలిగిన వ్యక్తి ఏ సమయానికి ఏ మార్గంలో వెళ్లాలనే విషయం గుర్తిస్తామన్నారు. కొత్త పాసులు ఇచ్చే వరకు పాత పాసులు కొనసాగుతాయని తెలిపారు.  నిత్యవసరాల కొనుగోలుకు 3 కిలోమీటర్లలోపు మాత్రమే వెళ్లాలని, వాహనదారులు  రెసిడెన్స్‌ ప్రూఫ్‌తోనే (నివాస ధృవీకరణ)  బయటకు రావాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు పాసులు ఇస్తామన్నారు. కలర్‌ కోడ్‌ ప్రకారం సంస్థలు ఉద్యోగులకు పాసులు ఇవ్వాలని పోలీసులకు సూచించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.21 లక్షల వాహనాలు సీజ్‌ చేశామన్నారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక ఆ వాహనాలను కోర్టులో డిపాజిట్‌ చేస్తామన్నారు. కోర్టు ద్వారానే వాహనాలు తీసుకోవాలన్నారు.   సాధారణ జబ్బుల చికిత్సకు సమీప ఆస్పత్రులకు వెళ్లాలని, తీవ్ర ఆరోగ్య సమస్య ఉండి దూరం వెళ్తే రిఫరెన్స్‌ పత్రాలు వెంట తీసుకురావాలని, ఆస్పత్రులకు వెళ్లే వారు కూడా రెసిడెన్స్‌ ప్రూఫ్స్‌ తీసుకురావాలని డిజిపి సూచించారు. రేషన్‌ దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, ఆహార పంపిణీ చేసేవారు భౌతిక దూరం పాటించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఇళ్లల్లోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై చర్చించామని ఆయన తెలిపారు. నిబంధనలను ఉల్లఘించే నిత్యావసర వస్తువుల దుకాణాలను కూడా సీజ్‌చేస్తామని హెచ్చరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments