పర్మినెంట్ చేయరు… జీతాలు పెంచరు
అధికారిక ఉత్తర్వులే ఆచరణకు నోచుకోని దుస్థితి
మైనారిటీ సంక్షేమశాఖలో అధికారుల లీలలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా బతుకులు మారలేదు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఆచరణకు నోచుకోలేదు. ఎప్పటికైనా తమ బతుకులు బాగుపడుతాయిలే అన్న ఆశతో సేవలందిస్తున్న ఉద్యోగుల ఆశలు అడియాశలవుతున్న పరిస్థితి. తమ కంటే అడ్డ కూలీలే నయం.. అన్న భావన ఉద్యోగుల్లో వినిపిస్తోంది. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా బతుకు భయం వెంటాడుతోంది. పర్మినెంట్ చేస్తామన్న హామీ అమలుకు నోచుకోక పోయినా కనీసం జీతాలన్నా పెంచుతారనుకుంటే అదీ లేదు. దీంతో ఉద్యోగుల బతుకు లు దుర్భరంగా మారాయి. మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు అవలంబిస్తున్న విధానాలు ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉర్దూ కంప్యూటర్ సెంటర్ ఉద్యోగుల దుస్థితి ఇది. రాష్ట విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉర్దూ కంప్యూటర్ సెంటర్ ఉద్యోగుల జీతాలు పెరిగి పర్మినెంట్ కాబోతుండగా తెలంగాణలో మాత్రం ఎక్కడ వేసి న గొంగళి అక్కడే అన్న చందాన మారింది. సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగం అయినా లభించే జీతం అక్షరాలా రూ.8,500. సర్వీసు 15 నుం డి 20 ఏళ్లు, జీతంలో మార్పు లేదు. ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మ డి రాష్ట్రంలో ఏర్పాటైన ఈ కేంద్రాల్లో మైనారిటీ నిరుద్యోగ యువతకు కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఇక్కడ శిక్షణ పొంది వేలాది మంది మైనారిటీ యువత స్వయం ఉపాధి పొందా రు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు మాత్రం రూ.5 వేల నుండి రూ.8,500 వరకు ఇస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఈ కేంద్రాలను ఉర్దూ అకాడమీ నుండి మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు మార్చారు. అప్పటి వరకు సాఫీగా నడిచిన కేంద్రాలకు ఒడిదుడుకులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇక్కడ పనిచేసే ఉద్యోగులు చాలీచాలని జీతాలతో దుర్బర బతుకులు వెళ్లదీస్తున్నారు. తమ సర్వీసులను క్రమ బద్ధం చేయకపోయినా జీతాలైనా పెంచాలని ఉద్యోగాలు ఆందోళన చేస్తూ వచ్చారు. అయినా వారి వేదన అరణ్య రోదనగా మిగిలిపోయింది.
అడ్డాకూలీలే నయం.. 20 ఏళ్లయినా బతుకు భయం
RELATED ARTICLES