అటవీ నేరస్తులను శిక్షించేందుకు కొత్త చట్టాలు
“జంగిల్ బచావో, జంగిల్ బడావో” నినాదంతో ముందుకు సాగాలి
అడవుల సంరక్షణపై సమీక్షలో సిఎం కెసిఆర్
హైదరాబాద్ : రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభు త్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కల ప స్మగ్లర్లపై పిడి యాక్టు నమోదు చేసి శిక్షిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హెచ్చరిం చారు. ప్రస్తుతం ఉన్న అటవీ చట్టాలను నిశితంగా సమీక్షించాలని, అడవులను రక్షించడానికి, ఆక్ర మణదారులను, స్మగ్లర్లను కఠినంగా శిక్షించడా నికి అవసరమైన కొత్త చట్టాలు తేవాలని, అవస రమైన మేరకు ఇప్పుడున్న చట్టంలో మార్పులు తేవాలని సిఎం చెప్పారు. “జంగిల్ బచావో, జంగిల్ బడావో” (ఉన్న అడవిని కాపాడాలి, పోయిన అడవిని పునరుద్ధరించాలి) అనే నినా దంతో అధికార యంత్రాంగం ముందుకు సాగా లన్నారు. అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సిఎం కెసిఆర్ శనివారం ప్రగతి భవన్‌లో పోలీసు, అటవీశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించా రు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె.జోషి, డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి, అటవీ శాఖ పిసిసిఎఫ్ పి.కె.ఝా, అడిషనల్ డిజి జితేందర్, ఐజిలు నవీన్ చంద్, స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, సిసిఎఫ్ రఘువీర్, సిఎంఒ అధికారులు భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎంఎల్‌ఎలు వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, కార్పొరేషన్ల చైర్మన్లు శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీని వాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
అడవి దొంగలపై ఉక్కుపాదం
RELATED ARTICLES