ఐసిసి తాజా ర్యాంకింగ్స్
టాప్ టెన్‌లో ముగ్గురు భారత బౌలర్లు
దుబాయి: ఐసిసి మంగళవారం ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్ ఉమెన్ స్మృతి మంధాన అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో వడోదర వేదికగా ముగిసిన మూడు వన్డేల సిరీస్ నుంచి స్మృతి మంధాన తప్పుకున్న సంగతి తెలిసిందే. 23 ఏళ్ల స్మృతి మంధాన కాలి బొటనవేలుకు గాయం కావడంతో సఫారీలతో వన్డే సిరీస్‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో ఐసిసి మంగళవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధానను వెనక్కినెట్టి న్యూజిలాండ్ క్రికెటర్ అమీ సత్తర్ వైట్ అగ్రస్థానంలో నిలిచింది. కాగా, మూడు వన్డేల సిరిస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మరోవైపు భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ఏడో స్థానానికి పడిపోయింది. ఇటీవలే మిథాలీ రాజ్ అంతర్జాతీయి క్రికెట్లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇక, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జులన్ గోస్వామి, శిఖా పాండే, పూనమ్ యాదవ్‌లు వరుసగా 6, 8, 9 స్థానాలకు పడిపోయారు. ఆల్‌రౌండర్స్ జాబితాలో భారత జట్టు నుంచి దీప్తీ శర్మ మూడో స్థానంలో నిలువగా శిఖా పాండే టాప్-10లో చోటు దక్కించుకుంది.
అగ్రస్థానం కోల్పోయిన స్మృతి
RELATED ARTICLES