న్యూఢిల్లీ: ఇండియన్ బాక్సర్ మేరీ కోమ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచింది. అసాధారణ రీతిలో ఆరోసారి వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన మేరీ.. ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. వరల్డ్ చాంపియన్‌షిప్స్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బాక్సర్ మేరీ కోమ్ కావడం విశేషం. గతేడాది నవంబర్‌లో జరిగిన టోర్నీలో 48 కేజీల విభాగంగా ఆమె చాంపియన్‌గా నిలిచింది. ఈ కేటగిరీలో 1700 పాయింట్లతో మేరీ టాప్ ప్లేస్‌లో ఉంది. అయితే 2020 ఒలింపిక్స్‌లోనూ పాల్గొనాలని భావిస్తున్న మేరీ.. 51 కేజీల విభాగంలో తలపడాల్సి ఉంటుంది. గేమ్స్ నుంచి 48 కేజీల విభాగాన్ని తొలగించారు. 2018 లో మేరీ మంచి ఫామ్‌లో ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌తోపాటు కామన్వెల్త్ గేమ్స్, పోలాండ్‌లో జరిగిన మరో టోర్నీలోనూ గోల్డ్ మెడల్స్ సాధించింది.
అగ్రస్థానంలో మేరీకోమ్!
RELATED ARTICLES