ప్రధాని గైర్హాజరు
ధరల పెరుగుదలపై నిలదీత
కేంద్రంపై వ్యూహాత్మక దాడికి ప్రతిపక్షాలు సిద్ధం
నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గైర్హాజరయ్యారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి ప్రభుత్వ ప్రతినిధులుగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే, ప్రధాని స్వయంగా రాకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంటు సమావేశాల నిర్వహణ తీరుతెన్నుల నుంచి చర్చించాల్సిన కీలక అంశాల వరకూ ఎన్నో విషయాలపై ఒక స్పష్టత రావడానికే అన్ని పార్టీలతో ప్రభుత్వం సమావేశం కావడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ, ప్రధాని హాజరుకాకపోవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం తగ్గింది. ఇలావుంటే, కొత్త నిబంధనల మధ్య వర్షాకాల
పదాల పట్టిక వంటి పలు అంశాలను లేవనెత్తడం ద్వారా కేంద్రంలోని మోడీ సర్కారుపై వ్యూహాత్మక దాడికి ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ఆగస్టు 12 వరకూ జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను, ఏకపక్ష విధానాలను ఎండగట్టాలని ప్రతిపక్షాలు భావిస్తుండగా, సాధ్యమైనన్ని ఎక్కువ బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవడమే కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. పార్లమెంటులో మొత్తం 35 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 32 బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కేవలం 14 రోజుల వ్యవధిలో ఇన్ని బిల్లులపై చర్చ ఎలా సాధ్యమని కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వాన్ని నిలదీశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు, ఆదివారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ధరల పెరుగుదల, అగ్నిపథ్, ఫెడరల్ వ్యవస్థపై దడి, నిఘా సంస్థలను దుర్వినియోగం చేయడం వంటి 13 అంవాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ అంశాలను పార్లమెంటు వేదికగా ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. చర్చలు జరగకుండా బిల్లులను ఆమోదింప చేసుకోవాలని కేంద్రం కుట్ర చేస్తున్నదని విమర్శించారు.