సైన్యాన్ని బలహీనపరిచే చర్యపై రాహుల్ డిమాండ్
న్యూఢిల్లీ : రైతులకు వ్యతిరేకంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న తరహాలోనే ‘అగ్నిపథ్’ పథకాన్ని కూడా ఉపసంహరించాలని కాంగ్రెస్‌పార్టీ పూర్వాధ్యక్షుడు,లోక్‌సభ సభ్యుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌చేశారు. తనను తాను జాతీయవాదిగా చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకం ద్వారా సాయుధబలగాలను బలహీనపరుస్తున్నదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెంటనే ఈ పథకం ద్వారా త్రివిధ దళాలలో చేపట్టే రిక్రూట్‌మెంట్లను రద్దు చేయాలనీ కోరారు. ‘వన్ ర్యాంక్’, ‘వన్ పెన్షన్’ గురించి మాట్లాడే కేంద్రం చివరకు త్రివిధ దళాలను ‘నో ర్యాంక్’, ‘నో పెన్షన్’ స్థాయికి తెచ్చిందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ ప్రశ్నల వేధింపులను ఎదుర్కొంటున్న రాహుల్‌గాంధీకి సంఘీభావం ప్రకటించడానికి కాంగ్రెస్‌పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఎఐసిసి కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈసందర్భంగా రాహుల్‌గాంధీ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, అధికారులు తనను ప్రశ్నిస్తున్నారా? లేదా? అనే విషయం ముఖ్యం కాదని, దేశంలో నిరుద్యోగ సమస్యే అతి ప్రధానమైనదని అన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలే దేశానికి వెన్నుముక అని కానీ మోడీ ప్రభుత్వం తన విధానాల ద్వారా ఈ వెన్ను విరిచేసిందని అన్నారు. ‘త్రివిధ దళాలలో ఉద్యోగాలు పొంది సేవలు అందించడం కోసం ఉదయమే రైలు ఎక్కి వెళుతున్న యువకులందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే, ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం అదేతరహాలో తన విధానాల ద్వారా దేశం వెన్ను విరిచేసింది, ఇక ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇచ్చే సామర్థ్యం లేదు’ అని విమర్శించారు. “ఇప్పటిదాకా ప్రభుత్వం చేసిందేమిటన్నది అనవసరం, కేవలం ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకు దేశాన్ని కట్టబెట్టిన నరేంద్రమోడీ నాయకత్వం వహించినంతకాలం ఈ ప్రభుత్వం యువతరానికి ఉద్యోగాలు ఇవ్వలేదు” అని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఇప్పుడు చిట్టచివరిగా సాయుధ బలగాలలో ఉద్యోగాలు పొందాలనుకునే యువతరానికి ఆఖరి అవకాశాలు కూడా లేకుండా మార్గాలు మూసివేశారని అన్నారు. “ఇప్పుడు సైన్యంలో ఉద్యోగాలు పొందాలనుకునే యువకులు అందరూ ఉదయమే రైలు ఎక్కి ఇక ఇంటి దారి పట్టాల్సిందే, సైన్యంలో మీకు సరిహద్దులు విధించిన తరువాత మీరు ఏ ఉద్యోగాన్నీ పొందలేరు” అని రాహుల్ అన్నారు. చైనా సైన్యం మన భూభాగంలో తిష్టవేసి కూర్చుంది, మనకు చెందిన , 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించి కూర్చుంది, ఈ నిజాన్ని ప్రభుత్వం సమ్మతించింది అని రాహుల్ అన్నారు. సైనికబలగాలను కచ్చితంగా బలోపేతం చేయాలి్ంసదే, కానీ ఈ ప్రభుత్వం మాత్రం బలహీనపడిపోతోంది అని అన్నారు. యుద్ధం వస్తే ఫలితాలు సుస్పష్టం, వాళ్ళు సైన్యాన్ని బలహీనపరిచారు, ఈ ధోరణి దేశానికి హాని చేస్తుంది, కానీ వాళ్ళు ఇంకా తమను తాము జాతీయవాదులుగా పిలుచుకుంటున్నారని రాహుల్ విమర్శించారు. అందువల్ల అగ్నిపథ్ పథకాన్ని మోడీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
27న దేశవ్యాప్త నిరసనలు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జూన్ 27l దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు కాంగ్రెస్‌పార్టీ పిలుపు ఇస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ చట్టసభల సభ్యుల సమావేశంలో చెప్పారు. దేశంలో యువకుల గరిష్ట వయోపరిమితి కేవలం 23గా పేర్కొంటే సరిపోదని, ఆ వయసు మించిపోయినవారు చాలామందే ఉన్నారని అన్నారు. నాలుగు సంవత్సరాల చాకిరీ తరువాత 75 శాతం మందిని బయటకు పంపించడం అంటే వారందరినీ తిరిగి నిరుద్యోగులుగా మార్చేయడమేనని విమర్శించారు. ఇదిలా ఉండగా, “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీ నిజమైన దేశభక్తి సైనాన్ని బలోపేతం చేయడంపైనే ఆధారపడి ఉంటుంది, కానీ మీరు సైన్యాన్ని బలహీనపరుస్తున్నారు, సైన్యం ఇప్పుడు నిరాశలో ఉంది,ఈ సమయంలో దేశ భవిష్యత్‌ను కాపాడేందుకు మేం యువత వెంట ఉంటాం” అని రాహుల్ గాంధీ సమావేశం అనంతరం హిందీలో ట్వీట్ చేశారు.
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
RELATED ARTICLES