ముహూర్తం మధ్యాహ్నం 12.30 గంటలకు
వేదిక: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం
గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రభుత్వ ఏర్పాటుకు నరసింహన్ ఆహ్వానం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 30వ తేదీన మధ్యా హ్నం 12.23 గంటలకు ఆయన ముఖ్యమంత్రి గా ప్రమాణం చేయనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు అధికారికంగా ప్రకటన చేశాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి సురేం ద్ర మోహన్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా అంతకుముందు వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సా యంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. కొద్దిసేపు సమావేశమై పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి శాసనసభ పక్షం తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందజేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సిపి శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అనంతరం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్మానించాలంటూ జగన్ గవర్నర్‌ను కోరారు. కాగా, జగన్ వెంట రాజ్‌భవన్‌కు వచ్చిన వారిలో జగన్ సతీమణి భారతి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, అవినాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా జగన్ హైదరాబాద్ వస్తున్నారని తెలియడంతో నగరంలో చాలా చోట్ల అభిమానులు భారీ హోర్డింగ్‌లు పెట్టించారు. మరికొన్ని రోజుల పాటు జగన్ బిజీగా గడపనున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కలుస్తారు. ఎపికి తిరిగి వచ్చిన అనంతరం పులివెందుల వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.
అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 30న జగన్ ప్రమాణం
RELATED ARTICLES