మధ్యంతర బడ్జెట్ చరిత్రాత్మకం
బిజెపికి లభిస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక టిఎంసి ఆందోళన : మోడీ
థాకూర్‌నగర్ : త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పశ్చిమబెంగాల్‌లో పర్యటించారు. ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. థాకూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార టిఎంసి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. బిజెపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని హింసకు పాల్పడుతున్నదని ఆరోపించారు. బిజెపిపై ప్రజలు చూపిస్తున్న ప్రమానురాగాలను చూసి తట్టుకోలేక మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. అనంతరం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు గురించి మాట్లాడుతూ దేశం రెండు ముక్కులుగా విడిపోయిన తరువాత భారత్ స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్నారు. పొరుగు దేశాల్లో ఉంటున్న హింధువులు, సిక్కులు, పార్శీలు, క్రైస్తవులు అక్కడ ఎన్నో బాధలు అనుభవించారని, ఎక్కడకు వెళ్లాలో తెలియక భారత్‌కు వచ్చారని, అలాంటి వారికి ఆపన్నహస్తం అందించేందుకు పౌరసత్వ బిల్లు ను తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు మద్దతివ్వండి, ఇక్కడున్న నా సోదరసోదరీమణులకు (పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న విదేశీయులను ఉద్దేశించి) ఈ బిల్లు ఎంతో అవసరమని ప్రధాని మోడీ తృణమూల్ పార్టీని కోరారు. కాగా, ర్యాలీకి ఎస్‌సి వర్గానికి చెందిన మతువాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మతువాలు పూర్వపు తూర్పు పాకిస్థాన్‌కు చెందిన వారు. 1950లో పశ్చిమ బెంగాల్‌కు వలసలు రావడం ప్రారంభించారు.పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 30 లక్షల మంది మతువాలు ఉన్నట్లు అంచనా. ఉత్తర, దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లోని కనీసం ఐదు లోక్‌సభ స్థానాల్లో జరిగే ఎన్నికల ఫలితాల్లో మతువాల ప్రభా వం ఉంటుంది. అయితే ఇంత వరకు చాలా మందికి భారత పౌరసత్వం లేదు. ఇదిలా ఉండగా ర్యాలీకి మతువాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారిని చూ సి మోడీ రెట్టింపు ఉత్సాహం తో ప్రసంగించారు. బిజెపికి కార్యకర్తలపై ఎందుకు హిం సకు పాల్పడుతున్నారో, అమాయకులను ఎందుకు చంపుతున్నారో నాకు ఇప్పు డు అర్థమైందని మమతా బెనర్జీపై, టిఎంసిపై ధ్వజమెత్తారు. మతువాలు తమపై చూపిస్తున్న ఆదరణ చూసి మమతకు వణుకు పుడుతోందన్నారు. కాగా, శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మధ్యంతర కేంద్ర బడ్జెట్‌పై మోడీ మాట్లాడారు. బడ్జెట్ చారిత్రాత్మకమైనదనీ, రైతులు, కార్మికు లు, మధ్యతరగతి వర్గాలు సహా స్వాతంత్య్ర వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన ప్రతి వర్గానికి మేలు జరుగుతుందని ఆయన అన్నారు. 12కోట్ల మంది చిన్న రైతులు, 30- కోట్ల మంది కార్మికులు, మూడు కోట్ల మం ది మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా పలు చర్యలు ప్రకటించామని ప్రధానిపేర్కొన్నా రు. బిజెపియేతర ప్రభుత్వాలు పోటీపడి రైతులకు రుణమాఫీ వాగ్దానాలు చేస్తున్నాయని, అయితే నిజమైన లబ్ధిదారులకు సహా యం అందడంలేదని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సం దర్భంగా రైతు రుణాలు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ తప్పుడు వాగ్దానం చేసిందని మోడీ విమర్శించారు.
నాలుగేళ్లు ముఖాలు కూడా చూసుకోకుండా ఇప్పుడు ఆలింగనాలా?
దుర్గాపూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా బిజెపికి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్న ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత నాలుగేళ్లలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోని వారు ఇప్పుడు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ నాయకులంతా ఒకరినొకరు తీవ్రపదజాలంతో దూషించుకొని జైళ్లకు కూడా వెళ్లారన్నారు. చిట్‌ఫండ్ నుంచి రక్షణ ఒప్పందాల వరకు డబ్బులు సంపాదించిన ఈ నాయకులకు చౌకీదార్ అంటే ఇష్టముండదని విమర్శించారు. అందువల్లే గత నెలలో టిఎంసి చీఫ్ మమతా బెనర్జీ నిర్వహించిన బ్రిగేడ్ ర్యాలీకి తరలివచ్చి మోడీని గద్దెదించాలని శపదం చేశాయన్నారు.
అందరికీ న్యాయం చేశాం
RELATED ARTICLES