లండన్ : హరికేన్ అంటే అతిపెద్ద తుపాను అని అందరికీ తెల్సిందే. హరికేన్లు అమెరికా, ఆఫ్రికా ప్రాంతాల్లో సంభవిస్తుంటాయి. భూమి పుట్టిన తర్వాత ఎన్నో వేల హరికేన్లు భూమిపై వివిధ ప్రాంతాలను చుట్టేసి మట్టుబెట్టాయి. అయితే హరికేన్లు అనేవి భూమికి మాత్రమే పరిమితం కాదు. అంతరిక్షంలోనూ హరికేన్లు సంభవిస్తాయంటే మీరు నమ్ముతారా? ఇది నిజమే. నమ్మాల్సిందే. అంతరిక్షంలో కూడా హరికేన్లు సంభవిస్తాయని, కాకపోతే అవి సముద్రపు అలలో, నీళ్లో, గాలులో కాదు. అదొక కాస్మిక్ ఈవెంట్. మన సౌర వ్యవస్థ పాలపుంతలో వుంది. ఇలాంటి పాలపుంతలో ఈ విశ్వంలో ఎన్నో వున్నాయని చెపుతుంటారు. రోదసీల సమాహారంలో ఎప్పటికైనా నక్షత్ర మండలాలను రాక్షస కృష్ణబిలాలు మింగేస్తాయని శాస్త్రవేత్తలు అంటుంటారు. ఇందుకు సంబంధించి ఈ మధ్య కొన్ని రుజువులను కూడా చూపించారు. అదేసమయంలో కృష్ణపదార్థాలు సమీకృతమవుతున్నట్లు కూడా చెపుతున్నారు. అయితే కృష్ణపదార్థాలు అంతరిక్షంలో సంభవించిన కొన్ని పరిణామాలకు ఉత్తేజితమై హరికేన్ తరహాలో సమీపంలోని ఇతర నక్షత్రాలను, గ్రహాలను, ఇతర అంతరిక్ష పదార్థాలను తుడిచిపెట్టేస్తున్నాయి. ఇదే వాదనకు బలాన్ని చేకూర్చేలా ఖగోళ శాస్త్రజ్ఞులు తాజాగా కొన్ని హెచ్చరికలను చేశారు. అవేమిటంటే, కృష్ణపదార్థాల తుపాను ఎప్పటికైనా భూమిని ఢీకొనవచ్చని అనుమానిస్తున్నారు.
అంతరిక్ష తుపాన్లు వచ్చేస్తున్నాయ్!
RELATED ARTICLES