అంతరిక్షంలోకి నాసా రోవర్ ప్రయోగం విజయవంతం
వాషింగ్టన్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చాన్నాళ్ల తర్వాత మరో అంతరిక్ష విజయం సాధించింది. మార్స్ (అంగారకుడి)పై పరిశోధనల కోసం మార్స్ రోవర్ పెర్సీవరెన్స్ పేరుతో మరో ప్రయోగాన్ని చేపట్టింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 7:50కి (భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5:29) అట్లాస్ 5 రాకెట్ ను ప్రయోగించింది. సూర్యుడిపైకి పరిశోధనల నిమిత్తం రెండేళ్ల క్రితం ఒక ఉపగ్రహాన్ని పంపించిన నాసా ఆ తర్వాత సాధించిన అతిపెద్ద విజ యం ఇదే. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ రోవర్ మార్స్‌పైకి చేరుకుంటుంది. 2.4 మిలియన్ డాలర్ల ఖర్చుతో దీన్ని చేపట్టింది. ఇప్పటి వరకూ అంగారకుడిపైకి నాసా చేపట్టిన ప్రయోగాల్లో ఇది తొమ్మిదోది. ఈ ప్రయోగం ద్వారా గతంలో అంగారకుడి పై మానవ ఉనికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తిం చే ప్రయత్నం చేయనుంది. ఇందుకోసం తర్వాతి తరానికి చెందిన రోబోటిక్ రోవర్‌ను అం గారకుడిపైకి పంపింది. ఇందులో చిన్న ఎస్‌యువి కారు పరిమాణంలో ఉండే ఆరు చక్రాల సైంటిఫిక్ వాహనంతో పాటు, చిన్న స్వయంచోదిత హెలికాఫ్టర్ డ్రోన్ కూడా ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో చేపట్టబోయే మానవ మిషన్స్‌కి సంబంధించి పరికరాలను పరీక్షిస్తాయి. అలానే రోవర్ సహాయంతో సిగార్ సైజ్‌లో ఉండే కాప్స్యుల్‌లో అంగారకుడి ఉపరితల నమూనాలకు భూమి మీదకు తీసుకురావాలని నాసా భావిస్తోంది. అనుకున్న ప్రకారం రోవర్ నమూనాలకు సేకరించి అంతరిక్షంలో భూమి మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వ్యోమనౌకకు అందించ గలిగితే 2031 నాటికి ఆ కాప్స్యుల్ శాస్త్రవేత్తల చేతికి అందనుంది. అంతకు మునుపే అంటే 2030కి వ్యోమగాములను అంగారకంపైకి పంపేందుకు నాసా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెపుతున్నారు. అయితే అమెరికాలో ప్రైవేటు అంతరిక్ష పరిశోధనలు విపరీతంగా పుట్టుకురావడంతో నాసా తన పరిశోధనలు తగ్గించి, ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడటం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రయోగాలకు భారత్‌కు చెందిన ఇస్రోపై కూడా ఆధారపడాల్సివచ్చింది. అయితే అమెరికన్ ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థలు వైఫల్యాలను మూటగట్టుకోవడంతో నాసా తిరిగి తన పరిశోధనలను ఉధృతం చేసింది.
అంగారకుడిపై… జీవం కోసం శోధన
RELATED ARTICLES