ప్రజాపక్షం/హైదరాబాద్ అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు జరిగాయి. అమ్మవారికి ఆల య కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల శివాలతో ఉజ్జయిని మహంకాళీ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. భక్తులు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే అమ్మ వారిని దర్శించుకున్నారు. బోనం సమర్పించడానికి ఆలయానికి బారులు తీరారు. బోనం తీసుకువచ్చే వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని అధికారుల సూచించారు. అయితే కరోనా భయంతో భక్తుల రద్దీ తగ్గింది. 2500 మంది పోలీసులతో భద్రతను ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో 200 సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. చుట్టూ కిలోమీటర్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి బంగారు బోనం, ఒడిబియ్యం సమర్పించారు. మాస్కు ధరించని వారిని దర్శనానికి అనుమతించమని పోలీసులు తెలిపారు. సోమవారం రంగం వేడుక నిర్వహించనున్నారు. ఈ ఏడాది బోనాల జాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పా ట్లు చేసింది. ఆలయాల అలంకరణ, పూజల నిర్వహణకు రూ.15 కోట్లు కేటాయించింది. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేసింది. వేడుకలను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో ఎల్ఇడి స్క్రిన్లు ఏర్పాటు చేశారు.
పట్టవస్రాలు సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, బోనం సమర్పించారు. తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని, కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మవారిని మొక్కుకున్నట్టు మంత్రి తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మరో మంత్రి తలసాని చెప్పారు. క్యూ లైన్లలో వచ్చే భక్తులకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నామి, భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరారు. మాస్క్‌లు, శాని టైజర్లను అందుబాటులో పెట్టామన్నారు. దేవాలయం ఇఒ మనోహర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్చార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులు పర్యవేక్షించారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టిపిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల ఏర్పాట్లను అంజనీ కుమార్ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. కాగా సికింద్రాబాద్ బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఆదివారం, సోమవారం ఆలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 25వ తేదీ తెల్లవారు జామున 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. తగిన ఏర్పాట్లు చేసింది. వేడుకలను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో ఎల్ఇడి స్క్రిన్లు ఏర్పాటు చేశారు.
పట్టవస్రాలు సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, బోనం సమర్పించారు. తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని, కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మవారిని మొక్కుకున్నట్టు మంత్రి తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మరో మంత్రి తలసాని చెప్పారు. క్యూ లైన్లలో వచ్చే భక్తులకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నామి, భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరారు. మాస్క్‌లు, శాని టైజర్లను అందుబాటులో పెట్టామన్నారు. దేవాలయం ఇఒ మనోహర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్చార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులు పర్యవేక్షించారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టిపిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల ఏర్పాట్లను అంజనీ కుమార్ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. కాగా సికింద్రాబాద్ బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఆదివారం, సోమవారం ఆలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 25వ తేదీ తెల్లవారు జామున 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు.
అంగరంగ వైభంగా లష్కర్ బోనాలు
RELATED ARTICLES