HomeNewsLatest Newsహైదరాబాద్‌లో కరోనా కేసుల నమోదుపై హైకోర్టు ఆందోళన  

హైదరాబాద్‌లో కరోనా కేసుల నమోదుపై హైకోర్టు ఆందోళన  

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకరమని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా ప్రభావం ఎలా ఉంది? టెస్టింగ్‌ కిట్లు ఎన్ని ఉన్నాయో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో 67 వేల టెస్టింగ్‌ కిట్లే ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారని, మరి పెద్ద సంఖ్యలో ఉన్న హాట్‌స్పాట్‌లలోని ప్రజలకు పరీక్షలు ఎలా చేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఈ నెల 24 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీం తో పాటు లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారన్న వ్యాజ్యంపైనా హైకోర్టు విచారణ చేపట్టింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని.. ప్రజలను కొట్టవద్దని డిజిపి ఆదేశించారని అడ్వొకేట్‌ జనరల్‌ (ఎజి) ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వనపర్తి ఘటనలో సస్పెన్షన్‌తో పాటు ఇంకా ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments