హైదరాబాద్:| ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య హైకోర్టు విభజన ప్రక్రియ పరిపూర్తయింది. తెలంగాణ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులను కేటాయించారు. దీంతో టిఎస్ కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 13కి పెరిగింది. అలాగే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుత చీఫ్ జస్టిస్ టిబి రాధాకృష్ణన్ కొనసాగుతారు. అలాగే ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ కు అప్పగించారు. అలాగే న్యాయాధికారులు, జిల్లా, ఇతర సెషన్ కోర్టుల న్యాయమూర్తలు పంపకం కూడా పూర్తయింది. దీంతో జనవరి 1వ తేదీ నుంచి ఇరు రాష్ట్రాలకు వేర్వేరు కోర్టులు పనిచేస్తాయి. కోర్టు విభజన పట్ల తెలంగాణ న్యాయవాదులు సంబురాలు చేసుకోగా, అమరావతిలో అసలు సౌకర్యాలే లేవని, ఎలా అక్కడ ఉండాలంటూ ఎపి న్యాయవాదులు నిరసనలు తెలియజేశారు.
హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తి
RELATED ARTICLES